రోజూ పాలు తాగే వారు ఎంతో మంది. వారంతా పాలు కాచి చల్లారాక తాగుతారు. కానీ ఒకప్పుడు ప్రాచీన కాలంలో పచ్చిపాలనే తాగేవారు. శరీరానికి కావాల్సిన కాల్ఫియాన్ని అందిస్తుంది.ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మనదేశంలో ఉదయం లేచాక లేదా రాత్రి పడుకునే ముందు పాలు తాగుతారు. అయితే చాలా మందికి ఉన్న సందేహం పచ్చి పాలు తాగవచ్చా లేదా? తాగితే ఏమవుతుంది?


పచ్చిపాలలో కూడా పోషకాలు ఉంటాయా. వాటిని తాగితే శరీరం పోషకాలను గ్రహిస్తుంది. పాలలో ఎంజైములు, ఆరోగ్యకరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాకపోతే వాటిలో సూక్ష్మజీవులు, బ్యాక్టిరియా ఉంటాయి. పాశ్చరైజేషన్ ప్రక్రియ ద్వారా వాటిని చంపి, తొలగిస్తారు. లేదా పాలను స్టవ్ మీద వేడి చేయడం వల్ల కూడా ఆ సూక్ష్మ జీవులు మరణిస్తాయి. అందుకే వేడి చేసుకున్నాకే తినమని సిఫారసు చేస్తారు వైద్యులు. 


పాలు మంచివే కానీ...
పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇన్నీ అన్నీ కావు. కాల్షియం, ఫాస్పరస్, బి విటమిన్లు, పొటాషియం, విటమిన్ డి పోషకాల లోడ్ చేసి ఉంటుంది. ఇందులో ప్రొటీన్ కూ పుష్కలంగా ఉంటుంది. ఇది కణజాల పునరుత్పత్తికి, మెదడుకు సహాయం చేయడంలో ముందుంటుంది. అయితే పాలను సరైన పద్ధతిలో తాగితేనే ఈ పోషకాలన్నీ అందుతాయి. పచ్చిపాలను తాగడం చాలా హానికరం అని చెబుతున్నారు వైద్యులు. మీరు ఏ రూపంలో పాలను తీసుకున్న ఫర్వాలేదు కానీ వాటిని కాచాకే తాగాలి. 


పచ్చిపాలతో ఇవే సమస్యలు
పచ్చి పాలను పాలకు సంబంధించి స్వచ్ఛమైన రూపంగా భావిస్తారు చాలా మంది. కానీ పచ్చి పాలలో లిస్టెరియా, ఇ.కోలి, కాక్సియెల్లా, సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్, యెర్సినియా వంటి బ్యాక్టిరియాలు ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య, జీర్ణ సమస్యలకు కారణం అవుతాయి. పాలు ఇచ్చిన జంతువుకు ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే అవి కూడా పాల ద్వారా మనిషి శరీరంలోకి చేరవచ్చు. అందుకే పచ్చిపాలు తాగిన వెంటనే కొందరిలో వికారంగా అనిపిస్తుంది. వాంతులు అవుతాయి. కొన్ని రకాల సిండ్రోమ్ లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక అధ్యయనం ప్రకారం పచ్చి పాలు తాగడం వల్ల గ్విలియన్ బారే సిండ్రోమ్, హిమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ రావచ్చు. అయితే కొంతమంది మాత్రం పచ్చి పాలలో యాంటీబయోటిక్ లక్షణాలు, జీర్ణక్రియను పెంచే ఎంజైమ్ లు ఉన్నాయని నమ్ముతారు. అందరి జీర్ణ వ్యవస్థలు, రోగనిరోధక శక్తి ఒకేలా పనిచేయదు. కాబట్టి కొందరికి పచ్చిపాలను తాగిన తట్టుకునే శక్తి ఉండొచ్చు. కానీ అందరికీ ఉండదు. కాబట్టి పచ్చి పాలు తాగే ముందు ఆలోచించుకోవాలి.  


Also read: మగవారితో పోలిస్తే ఆడవారికే ఎక్కువ నిద్ర అవసరం, ఎందుకో తెలుసా?


Also read: బొంగులో చికెన్‌లాగే ఇది బొంగులో ఉప్పు, కొనాలంటే ఒక నెల జీతం వదులుకోవాల్సిందే


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.