జానకి చదువు కాగితాలు తీసుకుని వచ్చేందుకు గోవిందరాజులు ప్రయత్నిస్తాడు కానీ విఫలమవుతాడు. అందుకని జ్ఞానంబ బీరువా తాళాలు తీసుకొచ్చి రామా వాళ్ళకి ఇస్తాడు. దొంగతనంగా తీసుకోవాలా అని రామా ఆశ్చర్యపోతాడు. తప్పదురా రాముడు ఇంతక మించి వేరే దారి లేదని అంటాడు. వద్దు మావయ్యగారు ఇప్పటికే అత్తయ్య గారికి తెలియకుండా చదువుకుంటున్నానని తన నమ్మకాన్ని మోసం చేస్తున్నామని ఇప్పటికే చాలా బాధపడుతున్నాం. ఇలా దొంగతనంగా సర్టిఫికెట్స్ తీసుకుంటే అత్తయ్యగారిని ఇంక ఇంకా మోసం చేసినట్టు అవుతుంది. అంతాకన్న పాపం మరొకటి ఉండదు. అందుకే వద్దు మావయ్యగారు అని జానకి అంటుంది. గోవిందరాజులు సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తాడు కానీ అందుకు రామా, జానకి ఒప్పుకోదు. రేపటి రోజున ఇవన్నీ అత్తయ్యగారికి తెలిస్తే నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారా అని చాలా బాధపడతారని అంటుంది. జానకి చెప్పింది నిజం నాన్న.. నేను కానీ జానకి గారు కానీ చిన్న అబద్ధం చెపితేనే  తట్టుకోలేదు, ఇక మేము ఇలా చేశామని తెలిస్తే మమ్మల్ని జీవితాంతం క్షమించదు అని రామా కూడా అంటాడు.


Also Read: తులసి బుట్టలో పడిన సామ్రాట్, అది చూసి ఉడికిపోతున్న నందు, లాస్య- అంకిత దగ్గరకి వచ్చేసిన అభి


మీ అమ్మ అంటే నాకు ఎంత ప్రేమో అంతే గౌరవం కూడా అలాంటిది నేనే మీకు ఇలాంటి సలహా ఇస్తున్నానంటే ఇది మోసం కాదని అర్థం చేసుకోండి, ఈ సమస్యకి ఇదే పరిష్కారం. మీరు చదువు కాగితాలు తీసుకుని వాటిని చూపించి మళ్ళీ తీసుకొచ్చి అక్కడే పెట్టేయండి అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు కదా. మీరు ఇంకేం ఆలోచించకండి అని చెప్పి తాళాలు చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. అదంతా మల్లిక చాటుగా చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఏదో గూడుపుటాని చేస్తున్నారు అది ఎలా తెలుసుకోవాలి.. వీళ్ళని ఫాలో అయితే విషయం ఏమిటో తెలిసిపోతుందని అనుకుంటుంది. గోవిందరాజులు జ్ఞానంబని గది నుంచి బయటకి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. రామా, జానకి అదంతా తొంగి చూస్తారు. జ్ఞానంబని గదిలోకి వెళ్ళకుండా చేసేందుకు గోవిందరాజులు తెగ తిప్పలు పడతాడు. తనకి గోరింటాకు పెడుతూ కదలకుండా కూర్చోబెడతాడు. వెంటనే రామా వాళ్ళని గదిలోకి వెళ్లమని సైగలు చేసి చెప్తాడు. అదంతా మల్లిక చూస్తూ ఏదో జరుగుతుంది, దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళు చేసుకుంటున్న సైగల వెనక ఏదో ఉందని అనుమానపడుతుంది. దీంతో రామా దొంగచాటుగా జ్ఞానంబ గదిలోకి వెళ్ళి బీరువాలోని జానకి సర్టిఫికెట్స్ తీసుకుంటాడు.


Also Read: మా నాయన దుర్మార్గుడని ఆదిత్యకి చెప్పిన దేవి- నీకోసమే ఇదంతా చేశానంటూ మాధవ పైశాచికత్వం


నా భార్య భవిష్యత్ కోసం ఇలా చేయక తప్పడం లేదు క్షమించమ్మా అని రామా బాధపడతాడు. అవి తీసుకుని బయటకి వచ్చి తండ్రికి సైగ చేస్తాడు. రామా ఏం తెచ్చాడా అని మల్లిక చూసేందుకు తెగ ప్రయత్నిస్తుంది. పోలేరమ్మ గదిలో నుంచి ఏవో ముఖ్యమైనవి తీసుకుని వెళ్తున్నారని అర్థం అవుతుంది.. కానీ ఆధారాలు లేకుండా చెప్తే పోలేరమ్మ నన్ను ఉతికి ఆరేస్తుందని ఆలోచిస్తుంది. ఈ విషయం ఎలాగైనా బయట పెట్టేందుకు ప్లాన్ వేస్తుంది. ఇక తన తమ్ముడుకి ఫోన్ చేసి రామా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకుని నాకు చెప్పు నేను అది చెప్పి ఇంట్లో సమస్యని సృష్టిస్తానని చెప్తుంది. మల్లిక చెప్పినట్టే తన తమ్ముడు జానకి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. రామా వాళ్ళు ఒక చోటకి వస్తారు. వెంటనే మీ చదువు కాగితాలు తీసుకెళ్ళి అధికారులకి చూపించండని రామా చెప్తాడు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనం బెస్ట్ స్టూడెంట్కి అవార్డ్ ప్రజెంట్ చేసే చోటుకి వెళ్ళాలని రామాకి చెప్తుంది.