అదేంటీ, అండర్ వేర్లు ధరించడాన్ని కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో నమోదు చేస్తారా? అనేగా మీ సందేహం. రికార్డులకు కాదేదీ అనర్హం. అందుకే, ఓ యువతి.. ఇలా ప్రయత్నించింది. ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కేసింది. 


గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌.. ఇది ప్రపంచలోనే ఎంతో ప్రత్యేకమైనది. ఇందులో చోటు దక్కించుకోవడం అంటే.. అంత ఈజీ కాదు. ప్రపంచంలో ఉన్న అందరిలోకెల్లా మనలో ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. అయితే చిత్ర విచిత్రమైన డేంజర్‌ స్టంట్స్‌తో కూడా ప్రతిభను కనబరిచే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. 


ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఒకే విషయంపై ఏళ్ల తరబడి కఠిన సాధన చేస్తూ ఉంటారు. అయితే ప్రపంచం మొత్తంలో ఎవరూ చేయలేని పనిని మీరు చేసినట్లయితే.. మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు కొంత నగదు కూడా సంపాదించుకోవచ్చు.


1955లో ప్రారంభమైన ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉంది. అయితే కొన్ని రికార్డులు వినేందుకు.. చదివేందుకు.. చూసేందుకు కాస్త వింతగా ఉన్నపట్టికీ.. అలాంటివి చేయడానికి కూడా టాలెంట్‌ కావాలని నిరూపిస్తుంటారు కొందరు. ఇప్పుడు అలాంటి వెరైటీ టాలెంట్‌కు సంబంధించిన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌.. సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.


30సెకన్లలో 19 అండర్‌వేర్లు వేసుకున్న యువతి

రేచెల్‌ స్మిత్‌ అనే యువతి 30 సెకన్లలో అత్యధిక అండర్‌ వేర్లు ధరించి రికార్డులకు ఎక్కింది. ముందుగానే ఏర్పాటు చేసుకున్న అండర్‌వేర్ల లైన్‌ సీక్వెల్లో ఉంచింది. ఆ తర్వాత టైమ్‌ స్టార్‌ అవగానే.. ఒకదానిపై ఇంకొకటి ధరించి, మొత్తంగా 19 అండర్‌వేర్లు వేసుకుంది. అంతేకాదు.. ఆమెకు ఫాస్ట్‌ డ్రస్సర్‌ అని పేరు కూడా వచ్చింది. అయితే గతంలో సిల్వియో సబ్బా అనే యువతి.. 30సెకన్లలో 14 అండర్‌వేర్లు వేసుకుని రికార్డును నమోదు చేసింది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బ్రేక్‌ చేస్తూ.. అదే 30సెకన్ల వ్యవధిలో ఏకంగా 19 అండర్‌వేర్లు ధరించి, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో నిలిచింది రేచెల్‌. అయితే ఈ రికార్డును ఎప్పుడు? ఎవరు? బ్రేక్‌ చేస్తారో చూడాలి. ఆ రికార్డును ఈ కింది ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో చూడండి. 






Also Read: ఇద్దరు వద్దు, ఒక్కరే ముద్దు అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పకుండా ఇది తెలుసుకోవల్సిందే