Marriage Rates Rise after the Pandemic : కరోనా రాక ముందు 2020లో ప్రతి 1000 మంది వ్యక్తులకు వివాహ రేటు 5.1 గణనీయంగా తగ్గింది. కానీ మహమ్మారి వచ్చి వెళ్లిన తర్వాత వివాహ రేటు పెరిగింది అంటుంది తాజా అధ్యయనం. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆధ్వర్యంలో చేసిన నేషనల్ సెంటర్​ ఫర్ హెల్త్ స్టడీ స్టాటిస్టిక్స్​ను తాజాగా విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం వివాహ రేట్లలో పెరుగుదలతో పాటు విడాకుల రేట్లు తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంది. 


పెళ్లిళ్లు పెరుగుతున్నాయి..


ఈ డేటా ప్రకారం మహమ్మారి వచ్చిన వెళ్లిన తర్వాత అంటే 2022 నాటికి ప్రతి వెయ్యిమందికి వివాహ రేటు 6.2 శాతం పెరిగింది. కరోనాను అరికట్టిన సంవత్సరం లోపు 2 మిలియన్లకు పైగా వివాహాలు జరిగాయని తెలిపింది. మహమ్మారి అనంతరం వివాహాలను రీషెడ్యూల్ చేయడమే కాకుండా.. నిబద్ధతతో కూడిన సంబంధాల కోసం ప్రజలు వెతుకుతున్నట్లు డేటా వెల్లడించింది. ఇదే నేపథ్యంలో విడాకుల రేటు తగ్గుముఖం పట్టినట్లు నిపుణులు చెప్తున్నారు. 


విడాకుల రేటు తగ్గింది..


మహమ్మారి తర్వాత అంటే 2022లో విడాకుల రేటు తగ్గుముఖం పట్టింది. ప్రతి వెయ్యిమంది వ్యక్తులకు 2.4 విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపింది. 2021లో అయితే అది 2.3గా ఉందని.. 2022కి అది స్వల్పంగా పెరిగిందని డేటా చెప్తోంది. అయితే 2000 సంవత్సరంతో పోల్చి చూస్తే ప్రతి వెయ్యిమందికి నాలుగు చొప్పును విడాకుల రేటు తగ్గింది. పలు సవాళ్లను ఎదుర్కోవడానికి జంటలుగా ఉండేందుకు మరింత ఇష్టపడుతున్నారని ఈ డేటా సూచిస్తుంది. ఇది మరింత మందిని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. 


ఆర్థిక విషయాలు బహిరంగమయ్యాయి..


ఈ ధోరణులు వివాహం పట్ల సామాజిక వైఖరిలో మార్పును ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. జంటలు తమ రిలేషన్ గురించి మరింత క్లారిటీగా ఉండడం, ఆర్థిక విషయాలు, వ్యక్తిగత ఫ్లాట్స్, భాగస్వామ్యానికి సంబంధించిన ఇతర కీలకమైన అంశాలను బహిరంగంగా చర్చించుకునే ధోరణి పెరిగిందని.. ఇది హర్షించదగ్గ విషయమని చెప్తున్నారు. ఇది వివాహ వ్యవస్థ బలపడేందుకు ఓ పాజిటివ్ సూచన అంటున్నారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా భాగస్వామితో స్నేహం ఏర్పరుచుకుంటున్నారని తెలిపారు. ఇది గుర్తించదగిన మార్పుగా పేర్కొంటున్నారు. ఇది సంబంధాలు మెరుగయ్యేందుకు తోడ్పడుతుందని తెలిపారు. 


అంతా లాక్​డౌన్ మహిమే..


కొవిడ్ సమయంలో వివాహాలు ఆగిపోయి ఈ రేటు పెరిగింది అనుకుంటే పొరపాటే. మహమ్మారి సమయంలో కూడా చాలా వివాహాలు జరిగాయి. కొందరు తేదీలు వాయిదా వేసుకున్నప్పటికీ.. కొన్ని చోట్ల వివాహాలు జరిగాయి. పైగా విడాకులు చాలావరకు తగ్గాయి. సుదీర్ఘమైన లాక్​డౌన్ మనుషుల మధ్య సంబంధాలను మెరుగుపరిచిందని ఈ స్టడీ తెలిపింది. మొదట్లో వారితో ఉండడానికి ఇబ్బంది పడినా.. తర్వాత వారిని అర్థం చేసుకుని సంబంధాలు మెరుగుపడ్డాయని నిపుణులు అంటున్నారు. 


అర్థం చేసుకుంటున్నారు..


పైగా స్త్రీలను పురుషులు.. పురుషులను స్త్రీలు అర్థం చేసుకుంటున్నారని ఇది మెరుగైన సంబంధానికి మంచి సంకేతమని చెప్తున్నారు. మహిళలు స్వతంత్రంగా ఉంటారని పురుషులు గుర్తిస్తున్నారు. ఆ వైపుగా వారికి సపోర్ట్ చేసేవారి సంఖ్యకూడా పెరుగుతుందట. అలాగే పురుషులు వ్యక్తిగా, శారీరకంగా, రక్షకుడిగా ఉంటున్నారని స్త్రీలు గుర్తిస్తున్నారని. వారికి ఎమోషనల్ సపోర్ట్ అందిస్తూ వారి బంధాన్ని మెరుగుపరచుకుంటున్నారని నిపుణులు చెప్తున్నారు. 


Also Read : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్​ చేస్తే.. గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం 91 శాతం ఎక్కువట