Pithapuram Assembly Constituency : కాకినాడ ఎంపీ వంగాగీతకు రాజకీయ బిక్ష పెట్టింది మనమేనని....ఆమె ప్రజారాజ్యం(Prajarajayam) పార్టీ ద్వారానే రాజకీయ అరంగేట్ర చేశారంటూ పవన్ కల్యాణ్(Pavan Kalyan) చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. పవన్ రాజకీయ ఓనమాలు నేర్చుకోక ముందే....ఇంకా చెప్పాలంటే ఆయన సినీరంగానికి రాక ముందే వంగా గీత(Vanga Geetha) రాజకీయాల్లో ఉన్నారు. పవన్ కల్యాణ్ కనీస అవగాహన లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైసీపీ(YCP) శ్రేణులు మండిపడుతున్నారు.
వంగాగీత ప్రస్థానం
పిఠాపురం(Pitapuram) నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు మంగళవారం పవన్‌కల్యాణ్(Pavan Kalyan) ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ...భవిష్యత్‌లో ప్రతి ఒక్కరూ జనసేన(Janasena)లో చేరతారాంటూనే తన ప్రత్యర్థి వంగాగీత(Vanga Geetha), కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ సైతం జనసేనలోకి రావాలంటూ ఆహ్వానిస్తూనే...వారిద్దిరికీ రాజకీయ బిక్ష పెట్టింది ప్రజారాజ్యమేనని గుర్తుచేశారు. ప్రజారాజ్యాం ద్వారానే వారు రాజకీయాల్లోకి అడుగుపెట్టారన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ(YCP) శ్రేణులు పవన్‌ను ఆడేసుకుంటున్నారు. పవన్(Pavan Kalyan) రాజకీయ అజ్ఞానానికి ఇదే నిదర్శనమంటూ సెటైర్లు వేస్తున్నారు. నీకు రాజకీయాల్లో ఎమ్మెల్యే, ఎంపీ మధ్య తేడా తెలియని రోజుల్లోనే వంగా గీత పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారని గుర్తుచేశారు. ఇంకా చెప్పాలంటే అసలు నువ్వు జనాలకు తెలియని రోజుల్లోనే అంటే...సినీరంగ ప్రవేశం చేయకముందే ఆమె ప్రజాసేవలో ఉన్నారని బదులిచ్చారు. పవన్‌కల్యాణ్ మొదటి సినిమాలో నటించింది 1996లో కాగా....దానికి రెండేళ్ల ముందే వంగా గీత పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1994ఎన్నికల బరిలో ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు.
చంద్రబాబు ఆశీస్సులు
వాస్తవానికి 1994 ఎన్నికల్లో ఆమె పిఠాపురం నుంచి తెలుగుదేశం(TDP) అభ్యర్థిగా రంగంలోకి దిగాల్సింది. చంద్రబాబు(Chandra babu), బాలియోగి ఆశీస్సులు ఆమెకు ఉండటంతో టిక్కెట్ ప్రకటించారు. కానీ అప్పటి వర్గపోరులో టిక్కెట్ వెన్నా నాగేశ్వరరావు చేజిక్కించుకున్నారు. నామినేషన్ వేసిన తర్వాత బీ ఫారం కోసం చివరి వరకూ ఆమె హైదరాబాద్(Hyderabad) లో తిరగడం వల్ల ఉపసంహరణ చేసుకునే ఛాన్స్ దక్కలేదు. దాంతో టీడీపీ అధికారిక అభ్యర్థిగా వెన్నా నాగేశ్వర రావు గెలిచిన ఆ ఎన్నికల్లో వంగా గీత ఇండిపెండెంట్ గా బరిలో ఉండాల్సి వచ్చింది. అమె పేరు బ్యాలెట్ పేపర్ మీద ఉన్నప్పటికీ గీత ఎటువంటి ప్రచారం చేయలేదు. ఆయినా 169 ఓట్లు దక్కాయి.అభ్యర్థిగా ప్రకటించి బీ-ఫారం ఇవ్వకుండా నిరాశ పరిచినా పార్టీని వీడకుండా నిలబడినందుకు ప్రతిఫలంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెను జిల్లాపరిషత్ ఛైర్మన్‌గానూ, ఆ తర్వాత రాజ్యసభ(Rajyasabha) టిక్కెట్ ఇచ్చి ఎంపీగానూ అవకాశం కల్పించారు.
ప్రజారాజ్యం ఆవిర్భావం తర్వాత చాలామంది టీడీపీని వీడి ఆ పార్టీలో చేరారు. వారితోపాటు వంగాగీత సైతం చిరంజీవి(Chirangeeve) పార్టీలో చేరారు. పిఠాపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత చిరంజీవితో పాటు కాంగ్రెస్‌లో చేరిన ఆమె...తదనంతర పరిణామాలతో వైసీపీ(YCP)లో చేరి గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. ఇప్పుడు మరోసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్నారు. పిఠాపురం నుంచి ఆమె ఇప్పుడు మూడోసారి బరిలో దిగుతుండగా....పవన్‌కల్యాణ్ మాత్రం ఆమెకు రాజకీయ బిక్ష పెట్టింది ప్రజారాజ్యమేనంటూ వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.