అసోంకు చెందిన ఒక వ్యక్తి నాణాలతో కొత్త స్కూటర్ కొన్నాడు. అతను ఇచ్చిన నాణాలు లెక్కపెట్టుకోవడానికే షోరూమ్ వారికి చాలా టైమ్ పట్టింది. అవన్నీ అతను ఎప్పటి నుంచో బండి కొనేందుకు దాచాడు.  అతను ఒక స్టేషనరీ నడుపుతున్న దుకాణదారుడు. తన షాపులో వచ్చిన చిల్లరంతా కొన్నేళ్లుగా దాయడం మొదలుపెట్టాడు. నాణాలతో బండి కొనాలన్న తన కోరికను తీర్చుకున్నాడు. ఆ దుకాణదారుడి పేరేంటో మాత్రం తెలియలేదు. అతడు తన కలను నెరవేర్చుకునేందుకు రోజూ కొంత మొత్తాన్ని దాచుకునేవాడు.  


అసోంకు చెందిన యూట్యూబర్ హిరాక్ జె దాస్ తన ఛానెల్ ఈ ఘటనపై ఓ వీడియో తీసి పోస్టు చేశాడు. తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. ‘ఒక కలను నెరవేర్చుకోవడానికి చాలా డబ్బు అవసరం అయి ఉండొచ్చు, కొన్నిసార్లు కొద్దికొద్దిగా డబ్బు పొదుపు చేసుకోవడం ద్వారా కూడా నెరవేర్చుకోవచ్చు’ అని క్యాప్షన్ పెట్టాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియోను కూడా పోస్టు చేశాడు. ముగ్గురు వ్యక్తులు నాణాల సంచిని మోసుకుంటూ వచ్చి,షోరూమ్ వారికి ఇచ్చారు. ఆ నాణాలను అయిదు బుట్టల్లోకి మార్చారు. వాటిని షోరూమ్ సిబ్బంది లెక్క పెట్టుకున్నారు. తెచ్చిన నాణాలు లక్ష రూపాయల వరకు ఉండడంతో అతనికి కొత్త బండిని అందించారు.గతంలో కూడా ఒక వ్యక్తికి ఇలాగే జీతం రూపంలో అతని యజమాని బకెట్ నిండా నాణాలు ఇచ్చారు. 





Also read: సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే అవిసె గింజలు, రోజూ గుప్పెడు తిన్నా చాలు


Also read: ఈ ఆహారాలకు ఎక్స్‌పైరీ డేటే లేదు, ఎన్నాళ్లయినా వాడుకోవచ్చు