చిత్తూరు జిల్లా చంద్రగిరి(Chandragiri) బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం(Road Accident) జరిగింది. నాయుడుపేట-పూతలపట్టు(Putalapattu) జాతీయ రహదారిలోని ఐతేపల్లె సమీపంలో ఆగి ఉన్న లారీ(Lorry)ని వెనుక వైపు నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు(Car)లో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారు విశాఖపట్నానికి(Visakhapatnam) చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. 



మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి అనంతలోకాలకు 


చంద్రగిరిలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. విశాఖపట్నం గాజువాక(Gajuwaka)కు చెందిన స్వాతి తన చిన్నకుమార్తె చాముండేశ్వరి మొక్కు తీర్చుకునేందుకు తిరుమల(Tirumala)కు వచ్చారు. శ్రీవారి దర్శనం శనివారం ఉండటంతో ఇవాళ తమిళనాడు వేలూరు(Veluru)లోని గోల్డెన్‌ టెంపుల్‌(Golden Temple)ను దర్శించుకునేందుకు పయనమయ్యారు. వారి కారు ఐతేపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి ముందు ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్వాతి, ఆమె కుమార్తె, ఆమె తమ్ముడు ప్రేమ్ కుమార్‌లతో పాటు మరొక వ్యక్తి సంఘటనా స్థలంలోని  మృతి చెందారు. కారు నడుపుతున్న డ్రైవర్ ఖాదర్ బాషాకు తీవ్రగాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయా ఆసుపత్రి(Ruya hospital)కి తరలించారు. సంఘటనా స్థలాన్ని తిరుపతి పశ్చిమ విభాగం డీఎస్పీ, సీఐ పరిశీలించారు. మృత దేహాలను ఆసుపత్రికి తరలించారు.


Also Read: 38 మందికి మరణ శిక్ష- అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో కోర్టు సంచలన తీర్పు


పోలీస్ చెక్ పోస్ట్ మీదకు దూసుకొచ్చిన కారు


కర్నూలు(Kurnool) శివారులోని పంచలింగాల(Pachalingala) ఎస్ఈబీ చెక్ పోస్ట్(SEB Check Post) వద్ద కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్(Hyderabad) వైపు నుంచి కర్నూలు వస్తున్న కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో డివైడర్ లకు గుద్దుకొని, సెబ్ చెక్ పోస్ట్ మీదికి దూసుకొచ్చింది. విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్(Head Constable) వెంకటేశ్వర్లు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన కాలు విరిగిపోయిందని వైద్యులు తెలిపారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యారు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసి కారు డ్రైవర్ ని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  విచారిస్తున్నారు. 


Also Read: మెరుపు వేగంతో వంతెన మీద నుంచి జంప్ చేసిన కారు.. కెమేరాకు చిక్కిన భయానక దృశ్యం