తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం(TNAU) రెండు కొత్త వరి వంగడాలని డెవలప్‌ చేసింది. కరవు పరిస్థితులను తట్టుకొని పండే రకం ఒకటైతే.. రెండోది ఉప్పు నేల పరిస్థితులను తట్టుకొని దిగుబడి ఇచ్చేది మరో రకం.  TNAU పరిశోధన డైరెక్టర్ కేఎస్‌ సుబ్రమణియన్ ఇటీవల ఎనిమిది వ్యవసాయ పంటలు,  ఏడు ఉద్యాన పంటలకు సంబంధించి కొత్త వంగడాలు కనుగొన్నారు. 


TRY 5 వరి రకం ఉప్పు నేలల్లో ఉన్న పరిస్థితులు తట్టుకొని మంచి దిగుబడి ఇస్తుంది.  సాంప్రదాయ పంటల కంటే 10-15 రోజులు ముందుగానే పంట పక్వానికి వస్తుంది.  "ఇది  జూన్-జూలై,  సెప్టెంబర్-అక్టోబర్, డిసెంబర్-జనవరి నెలల్లో సాగు చేసుకోవడానికి  అనువైనది. 


ఎకరాకు సగటున 5 టన్నులకుపైగా దిగుబడి వస్తుంది. ఇది మిల్లింగ్ రేటు 64 శాతం,  హెడ్ రైస్ రికవరీ రేటు 54 శాతం ఉంటుంది.


సుబ్రమణియన్ చెప్పినట్టుTKM 15 వరి రకం కరవు ప్రాంతాల్లో మంచి దిగుబడి ఇస్తుంది. ఈశాన్య రుతుపవనాల సమయంలో పాక్షిక పొడి పరిస్థితుల్లో నేరుగా విత్తడానికి అభివృద్ధి చేశారు దీన్ని. CO 55, కేవలం 115 రోజులలో హెక్టారుకు 6 టన్నుల దిగుబడిని అందించే వరి రకం. ADT 57 వరి రకం హెక్టారుకు సగటు దిగుబడి 6.5 టన్నులు.


ADT 7, VBN 5 అనేది TNAU విడుదల చేసిన రెండు పచ్చిమిర్చి సాగు రకాలు. ADT 7 హెక్టారుకు 724 కిలోల దిగుబడి ఇస్తుంది. 65 నుంచి 70 రోజుల్లో కోయవచ్చు. VBN 5 హెక్టారుకు 870 కిలోల దిగుబడి ఇస్తుంది.  70 నుంచి 75 రోజులలో కోయవచ్చు. VBN 5కి ముంగ్ బీన్ పసుపు మొజాయిక్ వైరస్ తాకే ఛాన్స్‌ చాలా తక్కువ. 


విఆర్‌ఐ 9,  విఆర్‌ఐ 10 అనే రెండు వేరుశెనగ వంగడాలను ప్రవేశపెట్టింది యూనివర్శిటీ.  ఈ రెండూ 48 శాతం నూనెతో 115 రోజుల్లో హెక్టారుకు 2,500 కిలోల దిగుబడిని ఇస్తాయి.  VRI 10 రకం 95 రోజుల్లో కోయవచ్చు. 


అరటి రకం CO 3, కర్పూరవల్లి x H201 నుంచి అభివృద్ధి చేశారు.  BSR 3 పసుపు రకం , MDU 2 వంకాయ రకం కూడా ఈ తమిళనాడు అగ్రీ యూనివర్శిటీ అభివృద్ధి చేసింది. ఇవి కూడా రైతులకు మంచి లాభసాటి దిగుబడి ఇస్తాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. 


Also Read: సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే అవిసె గింజలు, రోజూ గుప్పెడు తిన్నా చాలు