Weight Loss in Winter : చలికాలంలో నిద్రలేవాలంటేనే బద్ధకంగా ఉంటుంది. ఆఫీస్​లు, స్కూల్​కి వెళ్లడానికి కూడా చాలా లేజీగా ఉంటారు. శీతాకాలంలో పగలు తక్కువగా ఉండడం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్లే శరరీం రెస్ట్ కావాలని కోరుకుంటుంది. మరి ఈ సమయంలో జిమ్​లకు వెళ్లడం, వ్యాయామాలు చేయడం అనేది కష్టమైన పనే. కొందరు రెగ్యూలర్​గా జిమ్​కి వెళ్లేలా తమని తాము మోటీవేట్ చేసుకుంటారు. అయితే కొందరికి మాత్రం ఇది కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 


బరువు తగ్గడం కష్టం కానీ.. పెరగడం చాలా సులభం అన్నట్టే ఉంటాది. అయితే ఈ శీతాకాలంలో కూడా జీవనశైలిలో కొన్ని మార్పులు చేస్తే.. మీ బరువు మీ అదుపులో ఉంటుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఈ సమయంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి లైఫ్​స్టైల్​లో చేసే మార్పులు మన ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం చూపించేవై ఉండాలి. మరి ఎలాంటి మార్పులతో బరువును అదుపులో ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 


చురుకుగా ఉండండి..


బెడ్​ దిగనంతవరకు ఎంత బద్ధకంగా మీరున్నా సరే.. నిద్రలేచి అడుగు నేలపై పెట్టినప్పటి నుంచి చురుగ్గా ఉండేందుకు ప్రయత్నించండి. లేదంటే మీకు రోజులో 24 గంటలున్నా సరిపోవు. కాబట్టి మీరు నిద్రలేచినప్పటి నుంచి.. మీ పనులను చురుగ్గా పూర్తి చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు యాక్టివ్​గా ఉంటారు. పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేసి.. బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. శారీరక కార్యకలాపాలు ఎంత ఎక్కువగా ఉంటే.. మీరు బరువు అంత వేగంగా తగ్గుతారు.


ఫుడ్ విషయంలో మార్పులు


చలికాలంలో తెలియకుండానే చాలా ఎక్కువ ఫుడ్ తింటాము. ఫుడ్ ఎక్కువగా ఉంటే.. దానివల్ల కలిగే ఉపశమనం కోసం మరింత ఎక్కువగా తినేస్తాము. కాబట్టి ఫుడ్ ఎంత టేస్టీగా ఉన్నా.. ఎంత వేడిగా మిమ్మల్ని టెంప్ట్ చేస్తున్నా.. మీరు ఫుడ్​ విషయంలో కంట్రోల్​గా ఉండండి. ఫుడ్​ని ఒకేసారి కాకుండా.. చిన్న చిన్న భాగాలుగా చేసుకోండి. మూడు పూటల భోజనాన్ని ఐదు, ఆరు సార్లు తినేలా ప్లాన్ చేసుకోండి. ఇది మిమ్మల్ని చిరుతిళ్ల నుంచి దూరంగా ఉంచుతుంది. తద్వారా  మీ బరువు కంట్రోల్​లో ఉంటుంది. అంతేకాకుండా జీవక్రియ కూడా మెరుగ్గా ఉంటుంది. మీ డైట్​లో కూరగాయలు, ప్రోటీన్లు ఉండేలా చూసుకోండి. 


హైడ్రేటెడ్​గా ఉండండి..


చలికాలంలో చాలామంది నీటిని తక్కువగా తాగుతారు. చలికాలంలో వచ్చే అన్ని ప్రధాన సమస్యలకు ఇదే ఓ కారణం మీకు తెలుసా? మీరు శరీరానికి తగినంత నీరు అందివ్వకపోతే.. చర్మం వాడిపోతుంది. హెయిర్ పొడిబారిపోతుంది. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. కాబట్టి శరీరానికి తగిన మోతాదులో.. తగిన సమయంలో నీటిని అందించడం చాలా ముఖ్యం. ఇది శరీరంలో టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయం చేస్తుంది. నీటికి బదులు కొబ్బరి నీరు, నిమ్మనీరు కూడా మీరు తీసుకోవచ్చు. ఇవి కూడా మీరు హైడ్రేట్​గా ఉండడంలో సహాయం చేస్తాయి. 


స్వీట్స్ విషయంలో జాగ్రత్త


శీతాకాలంలో స్వీట్స్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. స్వీట్స్ తినొచ్చు తప్పేమి లేదు కానీ.. దాని తగ్గ వ్యాయామాలు చేయనప్పుడు వాటికి కాస్త దూరంగా ఉండటమే మంచిది. అయితే స్వీట్స్​ క్రేవింగ్స్​ను మీరు సహజమైన వాటితో కంట్రోల్ చేసుకోవచ్చు. తక్కువ మోతాదులో స్వీట్స్ తీసుకోవడం.. మిగిలిన సమయంలో ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్​తో భర్తీ చేయవచ్చు. 


నిద్ర విషయంలో..


ఆరోగ్యకరమైన బరువు కోసం మంచి నిద్ర అవసరం. నిద్ర ఎప్పుడూ తక్కువగా ఉండకూడదు. అతిగా ఉండకూడదు. రోజుకు 6 నుంచి 8 గంటలు కచ్చితంగా నిద్ర ఉండేలా చూసుకోండి. తక్కువ నిద్ర బరువు వేగంగా పెరిగేలా చేస్తుంది. అతి నిద్ర ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది. కాబట్టి నిద్ర విషయంలో ఎలాంటి ఇబ్బందలు లేకుండా త్వరగా పడుకోండి. ఉదయాన్నే త్వరగా నిద్రలేవండి. ఒత్తిడి కూడా బరువు పెరిగేందుకు కారణమవుతుంది కాబట్టి. రోజులో కాసేపు ధ్యానం చేయండి. వీటిని రెగ్యూలర్​గా పాటిస్తే.. మీరు చలికాలంలో కూడా బరువును కంట్రోల్​లో ఉంచుకోగలుగుతారు. 


Also Read : హెల్తీ, టేస్టీ బనానా మిల్క్.. ఇది ప్రోటీన్​కు మంచి సోర్స్


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.