Protein Banana Milkshake Recipe : శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ఇది రోజూవారీ శరీర కార్యకలాపాలను నిర్వహించడానికి సహాయం చేస్తుంది. ప్రోటీన్లు అమైనో ఆమ్లాలతో నిండి.. కణాలకు శక్తిని అందిస్తాయి. ఇవి మీరు రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు.. సరైన పెరుగుదల, అభివృద్ధి ఉండాలంటే కచ్చితంగా వారు తీసుకునే ఆహారంలో ప్రాధాన ప్రాధన్యత ప్రోటీన్​కే ఇవ్వాలి. అయితే దీనిని పొందేందుకు చాలా మంది మార్కెట్లలో దొరికే ప్రోటీన్​ పౌడర్లు, ప్రోటీన్ షేక్స్ ఉపయోగిస్తారు. కానీ మీరే ఇంట్లో ప్రోటీన్ మిల్క్ షేక్ (Protein Milk Shake) తయారు చేసుకోవచ్చు. ఇది వెజ్, నాన్​ వెజ్​వారికి కూడా మంచి ప్రోటీన్ సోర్స్ అవుతుంది. 


ప్రోటీన్​ సోర్స్ ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే మీరు బనానా ప్రోటీన్ మిల్క్ తయారు చేసుకోవచ్చు. దీనిలో ఓట్స్ ఉపయోగిస్తాము. ఇది కరిగే ఫైబర్ లక్షణాలు కలిగి ఉండి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పైగా ఇది ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. ఈ రెసిపీలో మనం బాదం పాలు ఉపయోగిస్తాము. ఇది విటమిన్​ ఇ కలిగి ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్​గా చెప్పవచ్చు. వృద్ధాప్యంలో మతిమరపు రాకుండా నిరోధించడంలో ఇది సహాయం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది బనానా ప్రోటీన్ మిల్క్ చాలా మంచిది. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు


బాదం పాలు - 1 కప్పు


అరటి పండు - 1


ఓట్స్ - 2 స్పూన్స్


దాల్చిన చెక్క పొడి - చిటికెడు


ఏలకుల పొడి - చిటికెడు 


తయారీ విధానం


బ్లెండర్ తీసుకుని దానిలో పాలు.. ఓట్స్, అరటిపండు, దాల్చిన చెక్క పౌడర్, ఏలకుల పౌడర్ వేసి బాగా బ్లెండ్ చేయాలి. ఇది మృదువైన స్థితి వచ్చే వరకు బాగా బ్లెండ్ చేయండి. అంతే బనానా ప్రోటీన్ మిల్క్ రెడీ. దీనిని ఉదయాన్నే హెల్తీ డ్రింక్​గా తాగేయొచ్చు. మీరు వీగన్​ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనిని తీసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో మొక్కల ఆధారిత పాలు మాత్రమే మనం వినియోగిస్తాము.


మీరు డైట్​ పాటిస్తూ.. జిమ్​కి వెళ్లే వారైతే.. మీకు ప్రోటీన్ చాలా అవసరం. మార్కెట్లలో దొరికే అన్​ హెల్తీ ఫుడ్స్ (Unhealthy Foods) కన్నా.. ఇంట్లోనే సింపుల్​గా తయారు చేసుకోగలిగే బనానా ప్రోటీన్ మిల్క్ మీరు ట్రై చేయవచ్చు. దీనిని పిల్లల నుంచి పెద్దల వరకు హ్యాపీగా తీసుకోవచ్చు. మధుమేహం ఉన్నవారు కూడా ఎలాంటి బెరుకు లేకుండా.. రోజులో ఏదొక సమయంలో దీనిని తీసుకోవచ్చు. ఇది మీ శరీరానికి ప్రోటీన్ అందించడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 


Also Read : ఈ డ్రింక్​తో బరువు తగ్గొచ్చు.. షుగర్​ కూడా కంట్రోల్ చేయొచ్చు


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.