Trinayani serial today Episode : సుమనను పడేయడానికి విక్రాంత్ చెప్పిన ఐడియాను అందరూ ఫాలో అవుతారు. ఇందుకు అరటి పళ్ల తొక్కలపై కాలు వేసి సుమన జారిపోయాలా చేయాలి అనుకుంటారు. విక్రాంత్ ఇచ్చిన రొమాంటిక్ షాక్‌కు సుమన విక్రాంత్‌ను వెతుక్కుంటూ కిందకి వచ్చి ఆ తొక్కలమీద కాలు వేసి జారిపడేలా ప్లాన్ చేస్తారు. ఇంతలో వల్లభ, తిలోత్తమ అక్కడికి రావడంతో నయని, విశాల్, పావనామూర్తి, విక్రాంత్, హాసిని షాక్ అవుతారు. వాళ్లకు తెలీకుండా మ్యానేజ్ చేస్తారు. ఇక వల్లభ, పావనామూర్తి అరటి పళ్లు తింటే ఆ తొక్కలను మెట్ల దగ్గరకు విసిరేస్తారు. మరోవైపు సుమన కిందకి దిగుతూ ఉంటుంది. అప్పుడే తొక్క మీద కాలు వేసి వాళ్లు ముందే సిద్ధంగా ఉంచిన కారం నీళ్లలో పడిపోతుంది. దాంతో సుమన మంట మంట అంటూ గట్టిగా అరుస్తుంది. 


ఇంతలో నయని తన చెల్లిని గదిలోకి తీసుకెళ్లి ఐ డ్రాప్స్ వేయమని విక్రాంత్‌కు చెప్తుంది. సరే అని విక్రాంత్ అంటాడు. అయితే సుమన నడిచి రాలేను అంటే విక్రాంత్‌ను అందరూ ఎత్తుకొని గదికి తీసుకెళ్లమంటారు. ఎలా ఎత్తుకోవాలో నేను చూపిస్తా అంటూ విశాల్ నయనిని ఎత్తుకుంటాడు. ఇక విక్రాంత్ కూడా అలాగే సుమనను ఎత్తుకొని రెండు జంటలు మేడమీదకు వెళ్తారు.  


తిలోత్తమ: రేయ్ నీకేమనిపిస్తుందిరా. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది నీకు.


వల్లభ: అర్థం కాలేదు మమ్మీ


తిలోత్తమ: హాసిన కలిపిన కారం నీళ్లలో సుమన పడలేదు. పడేలా చేశారనిపిస్తుంది. నిన్ను బకరాని చేయడానికి అరటి పళ్లు తినేలా చేసి చిన్న కోడలు ఒళ్లు వంచేలా చేశారు. 


వల్లభ: అంటే ఇదంతా ప్లాన్ అంటావా మమ్మీ


తిలోత్తమ: లేదంటే ఏంటిరా గులాబి పూలు కూడా తీసుకురాని విక్రాంత్ మల్లెపూలు తీసుకొచ్చి సుమన జడలో పెట్టాడు అంటే వాడి తలలో ఏదో ఉపాయం మెరెసే ఉండాలి (మరోవైపు హాసిని, డమ్మక్క, పావనామూర్తి పైకి వస్తారు.)


పావనా: విశాల్ బాబు నయనిని ఎత్తుకొని ఎక్కడికి వెళ్లాడు


హాసిని: ఇంకెక్కడికి వెళ్తాడు బాబాయ్ తలచుకుంటేనే సిగ్గేస్తుంది


పావనా: నువ్వు అలా మెలికలు తిరగకుండా అల్లుడిని నిన్ను ఎత్తుకోమని చెప్పొచ్చుకదా


హాసిని: నా కొడుకునే ఎత్తుకోడు నన్ను ఎత్తుకుంటాడా ఏంటి


డమ్మక్క: నెమ్మది నెమ్మది నీ భర్త, అత్త ఇటే వస్తున్నారు 


పావనా: వీళ్లు ఇప్పుడే రావాలా.. వాళ్లకు అర్థమై ఉంటుందా 


డమ్మక్క: నయని తొందరగా వస్తే బాగున్ను


వల్లభ: వాళ్లు ఏం చేస్తున్నారో మనకు ఎలా తెలుస్తుంది మమ్మీ


తిలోత్తమ: నయని వస్తే తెలుస్తుంది


నయని: అక్కా ఇక్కడ ఉన్నారా మీరు


హాసిని: నెమ్మదిగా మాట్లాడు గుంటనక్కలు ఇక్కడే ఉన్నారు. ఇటే చూస్తున్నారు


డమ్మక్క: మనం ఆలోచిస్తే సుమనకు మంటలు తగ్గిపోతాయి. 


హాసిని: సరే నేను అత్తయ్య వాళ్లని మ్యానేజ్ చేస్తా నువ్వు సుమన గదిలోకి వెళ్లు అక్క


మరోవైపు తిలోత్తమ, వల్లభ సుమన గది వైపు వస్తుంటే హాసిని వాళ్లు వారిని ఆపుతారు. ఇక నయని ఉలూచి పాపను ఎత్తుకొని బయటకు వస్తుంది. తిలోత్తమ, వల్లభ చూడకుండా కిందకి తీసుకెళ్తుంది. అయితే నయని ఉలూచిని తీసుకెళ్లడం తాను చూశానని తిలోత్తమ వల్లభకు చెప్తుంది. బాల్కానీకి వెళ్లి చూడమని వల్లభకు చెప్తుంది. వల్లభ వెళ్తాడు 


నయని: పెద్ద బొట్టమ్మ ఉలూచిని తీసుకొని వచ్చాను. పెద్దమ్మ నీ కూతుర్ని చూడటానికి ఆరాటపడే నీవు ఇప్పుడు నేను పిలిచినా రావడం లేదు అంటే నువ్వు ఇక్కడ లేవు అనుకోవాలా లేక మా చెల్లికి భయపడుతున్నావ్ అనుకోవాలా.. (ఇంతలో పాము రూపంలో పెద్దబొట్టమ్మ అక్కడికి వస్తుంది) వచ్చావా పెద్ద బొట్టమ్మ నువ్వు వస్తావ్ అని నాకు తెలుసు. ఉలూచి అమ్మ వచ్చింది చూడు


వల్లభ: బాబాయ్ పాము మనిషిలా మారడం కళ్లారా చూస్తున్నాను


పెద్దబొట్టమ్మ: నయని ఒకప్పుడు మీ అత్తయ్య గాయత్రీ దేవి కోసం నేను నా భర్త నాగయ్య మానవ రూపంలో కనిపించి మీ అత్తయ్యకు సాయపడేవాళ్లం. ఇప్పుడు మళ్లీ నీకోసం ఉలూచి కోసం ఇలా కనిపిస్తున్నాను తప్పితే మనిషి రూపంలో కనిపిస్తే మాకు ప్రమాదం 
ఇంతలో నాగయ్య ఎందుకు కనిపించడం లేదు అని నయని అడిగితే శాపం వల్ల రూపం మార్చుకోలేకపోతున్నారు అని పెద్దబొట్టమ్మ చెప్తుంది. ఎవరి వల్ల శాపం అని నయని అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.