Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అడుగుపెట్టింది అశ్విని. అందంగా రెడీ అయ్యి అటు ఇటు తిరుగుతూ అందరి మీద ఆరోపణలు చేయడం తప్పా అశ్విని చేసిందేమీ లేదని చాలామంది బిగ్ బాస్ ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. అసలు తను వచ్చిన మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోతుందని చాలామంది అనుకున్నారు. వచ్చిన మొదటివారంలోనే తనను నామినేట్ చేశారని ఏడుపు మొదలుపెట్టింది అశ్విని. అప్పటినుండి ప్రతీ చిన్న విషయానికి ఏడుస్తుందని తనకు హౌజ్‌లో క్రై బేబీ అని పేరు కూడా పెట్టేశారు. ఇక తాజాగా ఎలిమినేట్ అయ్యి హౌజ్ నుండి వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్‌లో పాల్గొంది అశ్విని. అక్కడ.. బయట ప్రేక్షకులకు తనపై ఉన్న అభిప్రాయం చూసి హర్ట్ అయ్యింది.


సెంటర్ ఆఫ్ యూనివర్స్ కాదు..
ముందుగా బిగ్ బాస్ బజ్‌లో ‘‘మీకు భోలేకు రిలేషన్ ఏంటి?’’ అనే ప్రశ్న అశ్విని ఎదురయ్యింది. దానికి అశ్విని ఏం మాట్లాడకుండా సిగ్గుపడుతూ నవ్వింది. ‘‘ఎవరిని నామినేట్ చేయాలో తెలియక మిమ్మల్ని మీరే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో నామినేట్ చేసుకున్నారా? ఓవర్ కాన్ఫిడెన్స్‌తో నామినేట్ చేసుకున్నారా?’’ అని గీతూ అడిగింది. ‘‘బిగ్ బాస్ హౌజ్‌లో రెండు గ్రూపులు ఉన్నాయి. కానీ నేను ఒక్కదాన్ని అయిపోయాను. ఇక్కడ నుండి వెళ్లిపోతే బెటర్ ఏమో అన్న ఆలోచనలు వచ్చాయి. ఏం చేసినా టార్గెట్’’ అని అశ్విని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ‘‘మీరేమైనా సెంటర్ ఆఫ్ యూనివర్స్ అనుకుంటున్నారా? హౌజ్ అంతా మిమ్మల్ని టార్గెట్ చేయడానికి’’ అని గీతూ కౌంటర్ ఇచ్చింది. 


ఊరికే ఏడుపు..
‘‘మీరు డిఫెండ్ చేసుకోలేనప్పుడు ఏడ్చేసి సింపథీ గేమ్ క్రియేట్ చేస్తారని ప్రేక్షకులకు అనిపించింది’’ అంటూ ప్రేక్షకుల అభిప్రాయాన్ని కరెక్ట్‌గా చెప్పింది గీతూ. దానికి అశ్విని.. ‘‘ఊ అంటే ఏడ్చే రకాన్ని అసలు కాదు’’ అని సమాధానమిచ్చింది. హౌజ్‌లో మాకు అలాగే అనిపించింది తని కౌంటర్ ఇచ్చింది గీతూ. ‘‘అసలు ఏది బయటికొచ్చిందో అర్థం కావడం లేదు’’ అని అశ్విని అనగా.. ‘‘మీరు ఏం చేశారో అదే బయటికొచ్చింది’’ అని చెప్పింది. తను అడుగుతున్న ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో ఇక్కడ సేఫ్ గేమ్స్ వద్దు అని సలహా ఇచ్చింది గీతూ. ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్‌ను ఒక్కొక్క జంతువుతో పోల్చమని చెప్పగా.. ప్రియాంకకు రంగులు మార్చే ఊసరవెళ్లి ట్యాగ్ ఇచ్చింది అశ్విని. ‘‘ఆడియన్స్ అందరికీ పైకి ఒకలాగా కనిపిస్తుంది. కానీ లోపల తను వేరే’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. అది ఎదగదు, వేరే వాళ్లను ఎదగనివ్వదు. అలాంటి పీత ఎవరు అని అడగగా.. రతిక అని చెప్పింది అశ్విని. యావర్‌కు గొర్రె అని స్టిక్కర్ ఇచ్చింది.


ప్రశాంత్‌కు భజన..
ఆ తర్వాత సెగ్మెంట్‌లో బిగ్ బాస్ ప్రేక్షకులు.. అశ్వినిపై సోషల్ మీడియాలో చేసిన కొన్ని కామెంట్స్‌ను తనకు చూపించింది గీతూ. ముందుగా చూపించిన కామెంట్‌లో ‘‘అశ్విని పల్లవి ప్రశాంత్‌కు సపోర్ట్ చేయలేదు. భజన చేసింది’’ అని ఉంది. అది చూసి ‘‘ఏం భజన’’ అని అడిగింది అశ్విని. ప్రశాంత్ తోపు అంటూ అశ్విని అన్న మాటలను తనకు గుర్తుచేసింది గీతూ. ఆ తర్వాత కామెంట్‌లో ‘‘బిగ్ బాస్‌కు ఎందుకు వచ్చావో తెలియదు. ఏం చేస్తున్నావో తెలియదు. అసలు నీ వల్ల ఏం ఉపయోగం అశ్విని బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు’’ అని ఉంది. అది చదివిన అశ్విని హర్ట్ అయ్యింది. ‘‘ఇలాంటి ప్రశ్నలు అడిగితే నేను వెళ్లిపోతాను’’ అని చెప్పింది. ‘‘ఈ చిన్న ఒత్తిడినే తీసుకోలేకపోతే బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎందుకు వచ్చారు’’ అని అడిగింది గీతూ. ‘‘ఎందుకు వచ్చావో తెలీదు. ఏం చేస్తున్నావో తెలీదు. ఎక్కడున్నావో తెలీదు. వాళ్లకెందుకు నేనేం  చేస్తున్నాను. ఎక్కడున్నాను అనేది’’ అని అశ్విని సీరియస్ అయ్యింది. వాళ్లే కదా మీకు ఓటు వేయాల్సింది అని క్లారిటీ ఇచ్చింది గీతూ.



Also Read: బిగ్ బాస్ హౌజ్ నుండి రతిక ఎలిమినేట్ - అతడి వల్లే అని చెప్తూ ఎమోషనల్


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply