Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో తాజాగా జరిగిన ఎలిమినేషన్‌లో అశ్విని ఔట్ అయ్యింది. ఈవారం డబుల్ ఎలిమినేషన్ కాగా.. శనివారం అశ్విని ఎలిమినేట్ అయ్యి హౌజ్ నుండి బయటికి వెళ్లిపోయింది. ఆదివారం కూడా మరో ఎలిమినేషన్ జరగనుంది. ఇక సండే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. అందులో స్టేజ్‌పైకి వచ్చిన అశ్వినిని.. హౌజ్‌మేట్స్‌తో మాట్లాడిస్తారు నాగార్జున. ముందుగా హౌజమేట్స్‌లో ఎవరు హిట్, ఎవరు ఫ్లాప్ అని చెప్పమంటారు. ఇక అశ్విని వెళ్లిపోయిన తర్వాత హౌజ్‌మేట్స్‌తో సండే ఫన్‌డే గేమ్స్ ప్రారంభిస్తారు.
మంచి ఫ్రెండ్..
‘‘నువ్వు వెళ్లిపోయే ముందు ఈ హౌజ్‌లో హిట్ ఎవరు, ఫ్లాప్ ఎవరు చెప్పేసి వెళ్లాలి’’ అని నాగార్జున చెప్పడంతో ఈ ప్రోమో మొదలయ్యింది. ముందుగా ప్రశాంత్ గురించి చెప్తుంది అశ్విని. ‘‘ప్రశాంత్ కొన్నిసార్లు మాట వినడు’’ అని చెప్పింది. దాంతో నాగార్జున.. ‘‘నీకు మిమిక్రీ చేయడం వచ్చా?’’ అని అశ్వినిని అడిగారు. లేదు అని అశ్విని సమాధానమివ్వగా.. ‘‘నువ్వు శివాజీలాగా మిమిక్రీ చేసి చెప్తే వినేస్తాడు’’ అని నాగ్ అనగానే.. అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత ‘‘మంచి ఫ్రెండ్‌ను తీసుకెళ్తున్నాను బిగ్ బాస్ హౌజ్ నుండి. అనుకోలేదు ఇంత ఫ్రెండ్‌షిప్ అవుతుంది అని’’ అంటూ యావర్ గురించి చెప్పింది అశ్విని. ‘‘నీతో తెలుగులోనే మాట్లాడతాడా?’’ అని నాగ్ అడగగా.. అవును అని చెప్పింది. ‘‘ఆడపిల్లలతో అయితే మాట్లాడతాడులే’’ అని కౌంటర్ వేశారు నాగార్జున.
నాకైతే ఫ్లాప్..
ఆ తర్వాత ప్రియాంకపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది అశ్విని. ‘‘మంచిదే కానీ కాస్త తొందరపాటు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. హిట్టా? ఫ్లాపా? అని అడగగా ‘‘నాపరంగా చూస్తే నాకైతే ఫ్లాపే’’ అని చెప్పేసింది. అందరికీ హిట్, ఫ్లాప్ అని ట్యాగ్స్ ఇచ్చేసిన తర్వాత హౌజ్‌లోని గ్రూప్స్ గురించి మాట్లాడింది అశ్విని. ‘‘ప్రియాంక, శోభా, అమర్ ముగ్గురు ఒక గ్రూప్. శివాజీ, రతిక, యావర్, ప్రశాంత్ వీళ్లంతా ఒక గ్రూప్. గౌతమ్ మాత్రం ఏకాకిలాగా మిగిలిపోయి ఏం చేయాలో అర్థం కాక అలా అయిపోయాడు’’ అని చెప్పింది. మధ్యలో అర్జున్ జోక్యం చేసుకొని ‘‘ఆ ఏకాకిదాంట్లో కూడా లేనా నేను?’’ అని అశ్వినిని అడిగాడు. ‘‘అర్జున్ అసలు దేంట్లో లేడు. నిన్ను చూస్తే ఏం చేస్తావో అని భయమేస్తుంది’’ అని నాగ్ రిప్లై ఇచ్చారు. ఇక హౌజ్‌లో ఉన్న గ్రూప్స్ గురించి చెప్తూ.. ‘‘చుక్క బ్యాచ్, ముక్క బ్యాచ్ మధ్యలో తొక్క బ్యాచ్’’ అంటూ కామెడీ చేయగానే అందరూ నవ్వుకున్నారు.
గువ్వ ఎవరు? గోరింక ఎవరు?
ఇక సండే ఫన్‌డే టాస్కులో ఇన్నిరోజులు హౌజ్‌మేట్స్ కలిసి ఉన్న బిగ్ బాస్ హౌజ్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు నాగార్జున. ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కోసం కంటెస్టెంట్స్‌ను స్పా బ్యాచ్, స్పై బ్యాచ్ అని రెండు బ్యాచ్‌లుగా విభజించారు. ఏ ప్రశ్న అడిగినా రతిక సరైన సమాధానం చెప్తుండడంతో ‘‘ఆటంతా ఆపేసి ఇవన్నీ లెక్కలు వేస్తున్నావా’’ అని కౌంటర్ ఇచ్చారు నాగ్. ఆ తర్వాత నాగార్జున ఒక ఫోటో చూపించగా.. దానికి సంబంధించిన పాటను గెస్ చేయాలి. గువ్వ గోరింకతో పాటను ప్రశాంత్ కరెక్ట్‌గా గెస్ చేయగా.. ఆ పాటకు రతికతో కలిసి డ్యాన్స్ చేయమన్నారు నాగ్. డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇందులో గువ్వ ఎవరు? గోరింక ఎవరు అని నాగార్జున అడగగా.. అది మాకు కూడా తెలియడం లేదని నవ్వాడు అర్జున్. ఆ తర్వాత నాగార్జున.. ఐన్‌స్టీన్ ఫోటో చూపించగా.. దానిని శివుడు అనుకొని కన్‌ఫ్యూజ్ అయ్యాడు అమర్‌దీప్. అలా సండే ఫన్‌డే గేమ్ చాలా ఫన్‌తో సాగిపోయినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
Also Read: 'చంటబ్బాయ్' రేంజ్ స్క్రిప్ట్ - బాలకృష్ణతో హిట్ కొట్టిన దర్శకుడితో మెగాస్టార్ సినిమా!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply