Chiranjeevi next movie: 'చంటబ్బాయ్' రేంజ్ స్క్రిప్ట్ - బాలకృష్ణతో హిట్ కొట్టిన దర్శకుడితో మెగాస్టార్ సినిమా!

Chiranjeevi gives nod to Balakrishna director: బాలకృష్ణతో కమర్షియల్ విజయం మాత్రమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా తీసిన దర్శకుడితో చిరంజీవి సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని టాక్.

Continues below advertisement

Chiranjeevi - Anil Ravipudi movie: మెగాస్టార్ చిరంజీవికి  2023లో మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది. సంక్రాంతికి విడుదలైన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ బరిలో మాంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన 'భోళా శంకర్' బోల్తా కొట్టింది. ఆ సినిమా ఫ్లాప్ కంటే రీమేక్ కావడం ఎక్కువ విమర్శలకు కారణం అయ్యింది. తెలుగులో యువ దర్శకులు చాలా మంది చిరంజీవితో సినిమా చేయడానికి రెడీగా ఉంటే... ఆయన రీమేక్ సినిమాల వెంట పడటం ఏమిటని కొందరు కామెంట్ చేశారు కూడా! 

Continues below advertisement

'భోళా శంకర్' ఫ్లాప్ తర్వాత చిరులో కూడా మార్పు వచ్చిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అనుకున్న సినిమాను పక్కన పెట్టి... 'బింబిసార' దర్శకుడు వశిష్ట సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. దాని తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా 'భగవంత్ కేసరి' తీసిన అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారని టాలీవుడ్ టాక్. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి!?
Chiranjeevi Upcoming Movies 2023: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అగ్ర నిర్మాత 'దిల్' రాజు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగు చిత్ర పరిశ్రమ ఖబర్. ప్రస్తుతం కథ విషయంలో హీరో, దర్శక నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. 

Also Readసుకుమార్ రేర్ రికార్డ్ - తెలుగులో రాజమౌళి తర్వాత లెక్కల మాస్టారే!

'భగవంత్ కేసరి' సినిమాలో బాలకృష్ణను వయసుకు తగ్గ పాత్రలో చూపించడం మాత్రమే కాదు... గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి మెసేజ్ చెప్పారు అనిల్ రావిపూడి. ఓ అగ్ర హీరోతో అటువంటి మెసేజ్ ఇప్పించినందుకు ప్రశంసలు అందుకున్నారు. నిజం చెప్పాలంటే... 'భగవంత్ కేసరి'కి ముందు అనిల్ రావిపూడి కామెడీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. బాలకృష్ణ సినిమాతో రూటు మార్చారు. డైరెక్షన్ కూడా మారింది. చిరంజీవితోనూ కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా మాంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీయాలని ట్రై చేస్తున్నారట. 

'చంటబ్బాయ్' రేంజ్ స్క్రిప్ట్ రెడీ!?
అనిల్ రావిపూడి డైరెక్షన్ అనేసరికి మెగా అభిమానులు, ప్రేక్షకులు 'చంటబ్బాయ్' రేంజ్ స్క్రిప్ట్ ఆశిస్తున్నారు. చిరంజీవిలో వింటేజ్ కామెడీ టైమింగ్ బయటకు తీసే సత్తా అనిల్ రావిపూడికి ఉందని, ఆయన శైలి కామెడీకి మెగాస్టార్ తోడు అయితే భలే ఉంటుందని అనుకుంటున్నారు. మరి, అనిల్ రావిపూడి మనసులో ఏం ఉందో!?

Also Readత్రివిక్రమ్ సెలక్షన్ మీద విమర్శలు, సందేహాలు - ఏంటిది ఆదికేశవ?

మెగా హీరోలతో 'దిల్' రాజు సినిమాలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'వకీల్ సాబ్' చేశారు. అంతకు ముందు రామ్ చరణ్ హీరోగా 'ఎవడు' సినిమా చేశారు. ప్రస్తుతం ఆయనతో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నారు. అయితే... మెగాస్టార్ చిరంజీవితో ఇప్పటి వరకు 'దిల్' రాజు సినిమా చేయలేదు. ఇది తొలి సినిమా అవుతుంది. 'భగవంత్ కేసరి', 'సరిలేరు నీకెవ్వరు' మినహా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటినీ 'దిల్' రాజు నిర్మించారు. 'సరిలేరు...'లో కూడా ఆయన నిర్మాణ భాగస్వామి.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

Continues below advertisement