Healthy Dish : రాత్రి సమయంలో లైట్ డిన్నర్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. హెవీ ఫుడ్ తీసుకుంటే.. అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా నిద్రకు భంగం కలిగిస్తుంది. జీర్ణమవ్వడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే రాత్రి వేళ డిన్నర్​ను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. లేదంటే మీరు అనారోగ్య సమస్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే డిన్నర్ కోసం ఓ చక్కటి రెసిపీ ఇక్కడుంది. ఇది ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందించడమే కాకుండా.. మంచి టేస్ట్​ని అందిస్తుంది. మరి ఈ హెల్తీ రెసిపీని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


పెసర పప్పు - అరకప్పు


బియ్యం - అరకప్పు


పసుపు - చిటికెడు


ఉప్పు - తగినంత


శొంఠి పొడి - అర టీస్పూన్


మిరియాల పొడి - చిటికెడు


యాలకుల పొడి - అర టీస్పూన్


తయారీ విధానం


ముందుగా పొట్టు ఉన్న పెసరపప్పును తీసుకోవాలి. లేదంటే పెసలను పప్పులాగా చేసుకోవచ్చు. అరకపప్పు పెసరపప్పును తీసుకుని దానిని బాగా కడగాలి. బియ్యాన్ని కూడా బాగా కలపాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని దానిలో పెసరపప్పు, బియ్యం వేసి బాగా కలపాలి. దానిలో 8 కప్పుల నీరు వేయాలి. పసుపు, ఉప్పు, శొంఠి పొడి, మిరియాల పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కుక్కర్ ఉంచాలి. ఓ నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 


స్టౌవ్ ఆపేసి.. కుక్కర్​లోని ప్రెజర్ పోనివ్వాలి. నీరు ఎక్కువ వేస్తాము కాబట్టి అది కాస్త గంజిని కలిగి ఉంటుంది. ఎక్కువ నీరు ఉందంటే వార్చుకోవచ్చు కానీ.. అది కాస్త గంజిని కలిగి ఉంటేనే మంచిది. కావాలంటే మీరు కుక్కర్ వెలిగించే సమయంలో మీకు నచ్చిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికిన పెసరపప్పు, బియ్యంలో నెయ్యి వేయాలి. అనంతరం దీనిని వేడిగా ఆస్వాదించడమే. రాత్రి సమయంలో ఈ ఫుడ్ డిన్నర్​గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఇది మీకు మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. 


ఈ డిష్​ని డయాబెటిస్ ఉన్నవారు కూడా హ్యాపీగా లాగించేయవచ్చు. అంతేకాకుండా జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారికి కూడా ఇది మంచి హెల్ప్ అవుతుంది. ఇది త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా.. మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. వేడిగా తీసుకుంటే ఇది మీకు హెల్తీ మీల్ అవుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడంలో కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. పెసరపప్పు పొట్టులోని ఫైబర్ మీకు జీర్ణసమస్యలను దూరం చేసి.. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. శొంఠి పొడి కూడా మీకు మంచి రుచిని అందించడంతో పాటు.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శొంఠి పొడి అందుబాటులో లేకుంటే మీరు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. ఉపయోగించుకోవచ్చు. 


Also Read : చెమట ఎక్కువ పడుతుందా? అయితే ఆ ఆరోగ్య సమస్యే కారణం




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.