శిలింధ్రాల జాతికి చెందినవి పుట్టగొడుగులు. అవి మొక్కజాతికి చెందవు, జంతు జాతికి చెందవు. అయితే ఎక్కువగా నాన్ వెజిటేరియన్లు మాత్రమే పుట్టగొడుగులను తినేందుకు ఇష్టపడతారు. వెజిటేరియన్లు వాటిని మాంసాహారంగానే భావిస్తారు. ఎందుకంటే శిలీంధ్రాలకు కూడా ప్రాణం ఉంటుందని వారి ఆలోచన. పుట్టగొడుగులతో ఎన్నో రకాల టేస్టీ వంటకాలు చేసుకోవచ్.చు పుట్టగొడుగుల బిర్యానీ, పుట్టగొడుగుల వేపుడు, పుట్టగొడుగులు టమోటో కర్రీ, పుట్టగొడుగుల మసాలా కర్రీ ఇవన్నీ కూడా ఎంతో రుచిగా ఉంటాయి. పుట్టగొడుగుల ప్రియుల కోసం ప్రతి యేటా మష్రూమ్ పండుగను నిర్వహిస్తారు. ఎక్కడో తెలుసా? భూటాన్‌లోని రాజధాని థింపుకి దగ్గరలో.


థింపూ నగరానికి దగ్గరలో జెనెకా అనే జిల్లా ఉంది. ఈ జిల్లా అందమైన లోయలతో ఉంటుంది. ఎవరినైనా పచ్చదనంతో మంత్రముగ్ధులను చేస్తుంది. ఆగస్టు 15, 16 తారీకుల్లో రెండు రోజులపాటు మష్రూమ్ ఫెస్టివల్ అక్కడ నిర్వహించారు. ఎంతోమంది ఇండియా నుంచి కూడా ఆ ఫెస్టివల్ చూసేందుకు వెళ్తారు. జెనెకా జిల్లాలో విస్తారంగా పుట్టగొడుగులను పండిస్తారు. ముఖ్యంగా మట్సుటేక్ మరియు చాంటెరెల్ అనే జాతికి చెందిన పుట్టగొడుగులను అధికంగా పండిస్తారు. ఈ పుట్టగొడుగుల పెంపకం పై స్థానికులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ వేడుకలో ఎన్నో రకాల పుట్టగొడుగులను ప్రదర్శిస్తారు.  అలాగే వాటిని అమ్మకానికి పెడతారు. అలాగే కొంతమంది అక్కడికక్కడే వండి వడ్డిస్తూ ఉంటారు. స్థానిక వంటకాలను పరిచయం చేస్తారు. ఎంతోమంది విదేశాల నుంచి ఈ వేడుక చూడడానికి వెళ్లి పుట్టగొడుగుల వంటకాలను రుచి వస్తారు. పుట్టగొడుగుల సూప్, కూర వంటి ఎన్నో రకాల వంటకాలను ఆస్వాదించవచ్చు. అలాగే రకరకాల  విత్తనాలు కూడా అమ్మకానికి పెడతారు. ఈ ఫెస్టివల్ కి వెళ్ళిన వారికి చుట్టుపక్కల చూడడానికి బౌద్ధ మఠాలు ఎన్నో ఉన్నాయి. బౌద్ధ సన్యాసులు ఆకర్షణీయంగా నాట్యాలు చేస్తారు. ఇవన్నీ చూసి రావచ్చు. అలాటే భూటాన్లోని అందమైన మంచుకొండలు కళ్లను కట్టిపడేస్తాయి. 


పుట్టగొడుగులు తినడం వల్ల పోషకాలు నిండుగా శరీరానికి అందుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఇవి అడ్డుకుంటాయి. మలబద్ధకం, అజీర్ణం వంటి పొట్ట సమస్యలు రాకుండా పుట్టగొడుగులు అడ్డుకుంటాయ. వీటిలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది. పుట్టగొడుగులను మందుల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. చైనా, జపాన్, కొరియా దేశాల్లో పుట్టగొడుగులకు చాలా విలువుంది. అక్కడ వీటిని ప్రత్యేకంగా తింటారు. సాంప్రదాయ వైద్యంలో వాడతారు. పుట్టగొడుగులను తినడం వల్ల విటమిన్ డి అధికంగా లభిస్తుంది. కాబట్టి విటమిన్ డి లోపం ఉన్న వారు పుట్టగొడుగులను తినడం చాలా ముఖ్యం. పుట్టగొడుగుల్లో విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి12 వంటివి ఉంటాయి. ఇవి మన శరీరానికి కచ్చితంగా కావాల్సిన పోషకాలు. వీటిలో యాంటీ బయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. వీటిని తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కొన్ని రకాల పుట్టగొడుగులు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఆడవారిలో జననేంద్రియాల వద్ద క్యాన్సర్ కణితులు వచ్చే అవకాశం తగ్గుతుంది. 


Also read: ప్రోటీన్ పౌడర్ రోజూ తీసుకుంటే మొటిమలు వచ్చే అవకాశం