వైద్యులు ఒక రోగి పొట్టలో దొరికిన వస్తువులు చూసి షాక్ తిన్నారు. అన్ని వస్తువులు అతను ఎలా మింగాడో తెలియక తలలు పట్టుకున్నారు.నాణాలు, మేకులు, రాళ్లు, బ్యాటరీలు, గాజు ముక్కలు ఇలా చాలా వస్తువులు పొట్టలో కనిపించాయి. అన్నీ కలిపి దాదాపు 233 వస్తువులు ఉన్నట్టు గుర్తించారు.ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తుంటాయని, అతను ఇన్నాళ్లు ఎలా బతికాడో తమకు అర్థం కావడం లేదని అంటున్నారు వైద్యులు.ఆ రోగి పేరు జెడ్ అని, వయసు 35 ఏళ్లని వివరించారు. 


ఎక్స్ రేలో బట్టబయలు
బుర్హాన్ డెమిర్ అనే వ్యక్తి తమ తమ్ముడికి పొట్టనొప్పిగా ఉందని చెప్పి ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు తెలిపారు వైద్యులు. అతని పొట్టను అల్ట్రాసౌండ్, ఎక్స్ రే స్కానింగ్‌లు, ఎండోస్కోపి చేయించారు. ఆ స్కానింగ్‌లలో పొట్ట నిండా ఎన్నో వస్తువులు ఉన్నట్టు కనిపించింది. అన్నీ వస్తువలు పొట్టలోకి ఎలా చేరాయో తెలియక తలలు పట్టుకున్నారు వైద్యులు. రోగి బంధువులను, రోగిని ప్రశ్నించగా అతనికి ఇలా వస్తువులు మింగే అలవాటుందని తేలింది. వెంటనే ఆపరేషన్ చేసి ఆ వస్తువులన్నింటినీ బయటికి తీశారు. వాటన్నింటనీ ఒక టేబుల్ పరిచగా మొత్తం 233 వస్తువులు తేలాయి. 


అదొక మానసిక రోగం...
చిన్న పిల్లలు తెలియక ఏదైనా మింగేయడం సాధారణం. కానీ 35 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి ఇన్ని వస్తువులు మింగడం సాధారణ విషయం కాదని చెబుతున్నారు వైద్యులు. అతనికి ఏదైనా మానసిక సమస్య ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు ఆపరేషన్ చేసి అన్నీ తొలగించినా కూడా ఆ రోగి తిరిగి అలాంటి వస్తువుల వైపు ఆకర్షితుడై మళ్లీ మింగే ప్రమాదం ఉంది. కాబట్టి అతడిని కచ్చితంగా మానసిక వైద్యుడికి చూపించాలని సిఫారసు చేస్తున్నారు. 


అయితే రోగి కుటుంబసభ్యులు మాత్రం తమకేమీ తెలియదని చెబుతున్నారు. ‘పొట్టనొప్పి వచ్చింది, ఈ ఆసుపత్రికి రిఫర్ చేశారే, వచ్చాము. ఇక్కడ ఆపరేషన్ చేసి వస్తవులను బయటికి తీశారు’ అని మాత్రమే అంటున్నారు. ఇదంతా జరిగి టర్కీలో దేశంలో. 





Also read: కిలో చికెన్ కన్నా కిలో చింతచిగురు ధరే ఎక్కువ, ఈ సీజన్లో దానికెందుకంత క్రేజ్


Also read: సగ్గుబియ్యంతో టేస్టీ దోశెలు, కొబ్బరి చట్నీతో తింటే ఆ మజానే వేరు