Sports Nutrition Tips : ఆరోగ్యంగా ఉండేందుకు న్యూట్రిషన్ శరీరానికి అందించడం చాలా ముఖ్యం. అలాగే కొన్ని న్యూట్రిషన్ టిప్స్​ని ఫాలో అవ్వడం కూడా అంతే ముఖ్యం. ఇది మీకు పూర్తి ఆరోగ్యాన్ని అందించడంతో పాటు.. శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా సోర్ట్స్ ఆడేవారికి అథ్లెట్స్​కి ఇవి మంచి టిప్స్ అవుతాయి. వీటివల్ల వారి పర్​ఫార్మెన్స్​కూడా పెరిగే అవకాశముందంటున్నారు. ఇంతకీ నిపుణులు ఇచ్చే న్యూట్రిషన్ టిప్స్ ఏంటంటే.. 


హైడ్రేషన్.. 


రోజులో కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి. రోజూ కచ్చితంగా నీటిని తీసుకోవాలి. వ్యాయామానికి ముందు కూడా మంచి నీళ్లు తీసుకుని.. కాస్త వ్యవధి తర్వాత ఎక్సర్​సైజ్ చేసుకోవచ్చు. యూరిన్ కలర్​ మీరు ఎంత హైడ్రేటెడ్​గా ఉన్నారో చెప్తుంది కాబట్టి.. దానిని కూడా మోనిటర్ చేస్తూ ఉండండి. శరీరానికి అవసరమైన నీటిని అందిస్తూ ఉండాలి. 


సమతుల్య ఆహారం.. 


సమతుల్య ఆహారం అనేది మిమ్మల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా హెల్తీగా ఉండేలా చేస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో 55 నుంచి 65 శాతం కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అయితే వీటిని గ్రెయిన్స్, పండ్లు, వెజిటెబుల్స్ రూపంలో తీసుకుంటే మంచిది. 15 నుంచి 20 శాతం ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. 20 నుంచి 25 శాతం హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవాలి. నట్స్, సీడ్స్, అవకాడో వంటివాటిలో హెల్తీ ఫ్యాట్ ఉంటుంది. 


వర్క్​ అవుట్​కి ముందు.. 


మీరు ఉదయమైనా.. సాయంత్రమైనా వర్క్​అవుట్ చేయాలనుకుంటే.. స్నాక్ టైప్​లో ఏమైనా తీసుకోవాలి. కనీసం గంట ముందు తీసుకుంటే మంచిది. సాయంత్రం వేళ చేస్తే.. 3 గంటల ముందు ఏమైనా తినొచ్చు. మీరు ఉదయాన్నే జిమ్​కి వెళ్లాలనుకుంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్​ని టోస్ట్​ చేసుకుని.. దానిని అరటిపండు, తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేదంటే ఎనర్జీ బార్​ లేదా గ్రీక్ యోగర్ట్ బెస్ట్ ఆప్షన్. ప్రోటీన్ అందుతుంది. నట్స్ లేక సీడ్స్​ కూడా తీసుకోవచ్చు. వీటిలో హెల్తీ ఫ్యాట్ ఉంటుంది. 


వర్క్ అవుట్ చేసిన తర్వాత.. 


ఎక్సర్​సైజ్ చేసిన తర్వాత శరీరానికి శక్తిని అందించి.. అలసటను దూరం చేసేందుకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అందిస్తే మంచిది. మీరు వ్యాయామం చేసిన అరగంట నుంచి గంటలోపు తీసుకుంటే మరీ మంచిది. కార్బోహైడ్రేట్స్ 3 శాతం తీసుకుంటే ప్రోటీన్ 1 శాతం తీసుకోవాలి. చాక్లెట్ మిల్క్, ప్రోటీన్ స్మూతి-ఫ్రూట్, ఎనర్జీ బార్ తీసుకోవచ్చు. 


ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్.. 


వ్యాయామం చేసే సమయంలో శరీరం చెమటను విడుదల చేస్తుంది. దీనివల్ల ఎలక్ట్రోలైట్స్ బయటకు వచ్చేస్తాయి. వాటిని రికవరీ చేసుకునేందుకు.. స్పోర్ట్స్ డ్రింక్స్, లేదా ఎలక్ట్రోలైట్స్ రిచ్ ఫుడ్స్ తీసుకోవచ్చు. అరటిపండు, డేట్స్​లలో ఇవి పుష్కలంగా ఉంటాయి. పొటాషియం అధికంగా ఉండే చిలగడదుంపలు, తోటకూర కూడా మంచివే. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్​ డార్క్ చాక్లెట్, బాదం కూడా కలిపి తీసుకోవచ్చు. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్స్​ని బ్యాలెన్స్ చేస్తాయి. 


కార్బోహైడ్రేట్స్.. 


చాలామంది కార్బ్స్​ని డైట్స్​ పేరుతో పూర్తిగా దూరం చేసేస్తూంటారు. అయితే ఇవి కూడా మన శరీరానికి చాలా అవసరమైనవే. కానీ లిమిటెడ్​గా తీసుకోవాలి. ఎక్కువగా తినేయకూడదు.. అలా అని పూర్తిగా మానేయకూడదు. కార్బోహైడ్రేట్స్ మీ డైట్​లో ఉంటే.. కచ్చితంగా మీరు వాటిని కేలరీల రూపంలో కరిగించుకోవాలని గుర్తించుకోవాలి. 


ప్రోటీన్ విషయంలో.. 


రోజూ 15 నుంచి 20 గ్రాముల ప్రోటీన్​ను.. వ్యాయామం తర్వాత కచ్చితంగా తీసుకోవాలని గుర్తించుకోండి. ఎక్సర్​సైజ్ చేసిన 30 నుంచి 60 నిమిషాల లోపు.. ప్రోటీన్ తీసుకుంటే కండరాల సమస్య ఉండదు. బలంగా తయారు అవుతాయి. వయసు పెరిగే కొద్ది మజిల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఆ డ్యామేజ్ ఉండకూడదంటే కచ్చితంగా ప్రోటీన్ తీసుకోవాలి. 



అది మాత్రం వద్దు.. 


షుగర్ ఉండే పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. షుగర్ డ్రింక్స్, ఫుడ్స్ తీసుకోకపోవడమే మంచిది. ఇవి ఎనర్జీ లెవెల్స్​ని క్రాష్ చేసి.. బద్ధకాన్ని పెంచుతాయి. మీరు యాక్టివ్​గా ఉండాలంటే వాటి జోలికి వెళ్లకూడదు. 


కాఫీ.. 


మీకు కాఫీ తాగే అలవాటు ఉంటే రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగొచ్చు. వ్యాయామానికి అరగంట ముందు కాఫీ తాగితే.. మీలో శక్తి పెరిగి.. మరింత ఎనర్జీతో వ్యాయామం చేస్తారు. 


నిపుణుల సలహా..


ఇవి కేవలం అవగాహన కోసమే. మీరు స్పోర్ట్స్​లో రాణించాలనుకుంటే కచ్చితంగా స్పోర్ట్స్ డైటీషియన్ లేదా హెల్త్ కేర్ ప్రోఫెషనల్స్​ని కలిసి గైడెన్స్ తీసుకోవాలి. మీరు తీసుకునే ఫుడ్, హైడ్రేషన్​ని ట్రాక్ చేసుకోండి. దీనివల్ల మీరు పొరపాట్లు చేయకుండా ఉంటారు. వీటిని కేవలం స్పోర్ట్స్ ఆడేవారే కాదు.. ఆరోగ్యంగా ఉండాలనుకునే అందరూ ఫాలో అవ్వొచ్చు. 



Also Read : పసుపుతో చేసే ఈ డ్రింక్​ని పరగడుపునే తాగితే ఎన్ని లాభాలో.. మ్యాజిక్ డ్రింక్ రెసిపీ