Benefits of Eating Dinner Before 8 PM : పగలంతా కష్టపడి.. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూస్తూ.. నచ్చిన సినిమా చూస్తూ.. డిన్నర్​ని లేట్​గా తినేవారిలో మీరు కూడా ఒకరా? అయితే జాగ్రత్త రాత్రి భోజనాన్ని వీలైనంత తొందరగా చేసేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే డిన్నర్ ఎంత లేట్​గా చేస్తే.. ఆరోగ్య సమస్యలను అంత కొని తెచ్చుకున్నట్టే అంటూ హెచ్చరిస్తున్నారు. రాత్రులు మీల్స్ తీసుకునేప్పుడు వీలైనంత త్వరగా ముందుగా ముగించేయాలని సూచిస్తున్నారు. ఇంతకీ డిన్నర్​ లేట్​గా తింటే ఏమవుతుంది? ఏ సమయంలో తింటే అనువైనదో.. దానివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


రాత్రుళ్లు ఆలస్యంగా తినడం వల్ల కలిగే నష్టాలివే


జీర్ణ సమస్యలు : డిన్నర్ ఆలస్యంగా చేయడం వల్ల కలిగే అతి ముఖ్యమైన సమస్య ఇది. కడుపు ఉబ్బరం, యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా మలబద్ధకం సమస్య పెరుగుతుంది. 


బరువు : రాత్రుళ్లు లేట్​గా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహమున్నవారు కచ్చితంగా ఎర్లీగా డిన్నర్ చేయాలి. మెటబాలీజం తగ్గిపోతుంది. దీనివల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది. 


నిద్ర సమస్యలు : రాత్రుళ్లు పడుకునేముందు కడుపు నిండుగా తింటే నిద్ర వస్తుంది అనుకునేవారు జాగ్రత్త. డిన్నర్ లేట్​గా చేయడం వల్ల నిద్ర సమస్యలు ఎక్కువైతాయట. ఇన్సోమియా పెరుగుతుంది. తలనొప్పి, ఫటిగో సమస్యలు వస్తాయి. 


డిన్నర్ త్వరగా ఎందుకు చేయాలంటే.. 


డిన్నర్​ని సూర్యస్తమయంలోపు పూర్తి చేస్తే చాలామంచిదని చెప్తున్నారు. కానీ.. అది అందరికీ సాధ్యం కాదు కాబట్టి.. కనీసం 8లోపు అయినా డిన్నర్​ని ముగించేయాలని సూచిస్తున్నారు నిపుణులు. నిద్రకు రెండు గంటల ముందు డిన్నర్​ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు. 


డిన్నర్ త్వరగా ముగించడం వల్ల కలిగే లాభాలివే


జీర్ణ సమస్యలు : జీర్ణ సమస్యలు కంట్రోల్​లో ఉంటాయి. తిన్నది అరగకపోవడం, యాసిడ్ రిఫ్లక్స్ వంటివి ఉండవు. 


మెటబాలీజం : రాత్రి 8 గంటలలోపు డిన్నర్ చేయడం వల్ల మెటబాలీజం పెరుగుతుంది. జీవక్రియ మెరుగుకావడం వల్ల బరువు తగ్గుతారు. పోషకాలు శరీరానికి అందుతాయి. 


మధుమేహం : మధుమేహమున్నవారికి రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. రెసిస్టెన్సీ పెరుగుతుంది. 


నిద్ర : మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది. నిద్రలేమి వంటి సమస్యలు దూరమవుతాయి. ఎలాంటి జీర్ణ సమస్యలు నిద్రను డిస్టర్బ్ చేయవు. 


బరువు : బరువు తగ్గడానికి ఎర్లీ డిన్నర్ హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా గుండె సమస్యలను దూరం చేస్తుంది. 


ఫోకస్ : ఒత్తిడి తగ్గి పనిపై ఫోకస్ పెరుగుతుంది. మెంటల్లీ స్ట్రాంగ్​గా ఉండడంలో ఎర్లీ డిన్నర్ హెల్ప్ చేస్తుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. 


ఈ రూల్​ని కేవలం పెద్దలే కాదు.. పిల్లల నుంచి ముసలివారు కూడా ఫాలో అయితే మంచిదని చెప్తున్నారు నిపుణులు. పైగా డిన్నర్​ ఎప్పుడూ లైట్​గా ఉండాలని.. ఎక్కువగా తినకపోవడమే మంచిదని చెప్తున్నారు. ఫ్రై చేసినా.. డీప్ ఫ్రై ఫుడ్ జోలికి వెళ్లకూడదని చెప్తున్నారు. 



Also Read : కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య ఉంటే.. ఫాలో అవ్వాల్సిన డైట్ ఇదే







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.