Ennallo Vechina Hrudayam Serial Today Episode త్రిపుర తన స్కూల్ పాప వాళ్ల నాన్నకి యాక్సిడెంట్ అవ్వడంతో పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్లి తన తండ్రి కోసం రక్తం అవసరం అయితే రక్తం ఇస్తుంది. ఇక బాల కారు టాప్ నుంచి బయటకు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇంతలో పక్క నుంచి వెళ్తున్న ఓ స్కూల్ బస్ మీద సాగర కన్య ఎగ్జిబిషన్ అని అతికించడంతో అది చూసి సాగర కన్య దగ్గరకు తీసుకెళ్లమని చెప్తాడు.
అనంత్ రామగిరికి రూట్ తెలికపోవడంతో కారు ఆపి కొందరిని అడ్రస్ అడుగుతాడు. దాంతో ఓ వ్యక్తి బాల తమ్ముడు అనంత్‌కి త్రిపుర చెల్లి గాయత్రీని చూపించి ఆమె ఈ టైంలో రామగిరి వెళ్తుంది తనని ఫాలో అవ్వమని చెప్తాడు. దాంతో అనంత్ వాళ్లు ఆమెను ఫాలో అవుతారు. గాయత్రీ వెళ్తూ రోడ్డు మధ్యలో ఆయిల్ పడి ఉండటంలో స్కూటీ ఆపి ఆయిల్ మీద మట్టి వేస్తుంది. అనంత్ అది చూసి తాను కూడా వెళ్లి మట్టి పోస్తాడు. గాయత్రీ అనంత్‌ని చూసి తనలా మంచి మనసు ఉన్న వాడేమో అని త్రిపుర చెల్లి అనుకుంటుంది. ఇక అనంత్ తనని ఫాలో అవుతాడు. గాయత్రీ స్కూటీ అద్దంలో చూసి కారుకి అడ్డంగా బైక్ ఆపుతుంది. సైగ చేసి అనంత్‌ని పిలుస్తుంది.
గాయత్రీ: ఏంటి ఫాలో అవుతున్నావా? కారులో మీ ఫ్యామిలీ కూడా ఉంది అయినా ఓ ఆడపిల్లని ఫాలో అవ్వడానికి కొంచెం అయినా బుద్ధి ఉందా.
అనంత్: అది కాదండి.
గాయత్రీ: ఏది కాదండీ. రోడ్డు మీద జనాలు పడిపోకుండా మట్టి పోస్తుంటే మంచి వారు అనుకున్నా కానీ ఇదంతా నా కోసమే అనుకోలేదు. కొంచెం అయినా బుద్ది ఉందా.
అనంత్: హలో హలో ఆగండి మేం రామగిరి వెళ్తున్నాం రూట్ తెలీక ఒకరికి అడిగితే మిమల్ని ఫాలో అవ్వమని చెప్పారు.
గాయత్రీ: ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా.
అనంత్: చెప్పే అవకాశం మీరు ఎక్కడ ఇచ్చారు. అసెంబ్లీలో అప్పుడప్పుడు మైక్ దొరికిన ఎమ్మెల్యేలా ఓ వాయించేశారు.
గాయత్రీ: సారీ రామగిరిలో మీరు ఎవరి ఇంటికి వెళ్లాలి.
అనంత్: ఇంటికి కాదు ప్రకృత్తి వైద్యశాలకి.
ప్రకృత్తి వైద్యశాలలో సేం సింహాద్రి సినిమాలో భూమిక వాళ్ల ప్రకృతి వైద్యశాలలో వేణుమాధవ్ కాళ్లు పడిపోయినట్లు నాటకం ఆడినట్లు ఇక్కడ ఓ వ్యక్తి సేమ్ టూ సేమ్ అలాగే ఉంటాడు. ఇక గాయత్రీ అనంత్ వాళ్లని అక్కడికి తీసుకొస్తుంది. మతి స్థిమితం సరిగా లేని బాల అక్కడికి వెళ్లగానే అక్కడ అందరూ యోగా చేస్తుంటే వాళ్ల దగ్గరకు వెళ్లి వాళ్ల లానే ప్రవర్తిస్తాడు. బాల పక్కన కూర్చొన్న ఓ పెద్దాయన పక్కనున్న అమ్మాయిని చూస్తూ తిల తిప్పకుండా ఉంటే బాల చూసి పెద్దాయనకు తల తిరగడం లేదని తల తిప్పేయాలని ప్రయత్నిస్తాడు. అందరూ బాలని ఆపుతారు. ఇక బాలని ఆయుర్వేదిక ప్రకృతి వైద్యశాల వైద్యుడు బాలని చూసి సమస్య ఉందని అంటాడు. పసరు మందు ఇస్తాడు.
కొన్ని రోజులు ఇక్కడే ఉంటే కచ్చితంగా మార్పు వస్తుందని చెప్తారు. దాంతో అనంత్ ఆయనతో మాకు ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది ఇక్కడే ఉంచి రోజూ వైద్యానికి తీసుకొస్తామని అంటాడు. గెస్ట్ హౌస్‌కి అందరూ వెళ్తారు. అక్కడ ఊయల, జారుడుబల్ల పార్క్‌లో ఉన్నట్లు అన్నీ ఉంటే బాల అక్కడే చిన్న పిల్లాడిలా ఆడుకుంటాడు. అందరినీ లోపలికి వెళ్లిపోమంటాడు. దాంతో బాల తండ్రి అక్కడే ఫోన్లో మాట్లాడుతూ బాలని గమనిస్తూ ఉంటాడు. ఇంతలో జాతర ఉందని బాలత్రిపుర సుందరి అమ్మవారి తిరునాళ్లలో భాగంగా సాగర కన్య నాటకం ఉందని అనౌన్స్ మెంట్ రావడంతో బాల ఆటో వెనక పరుగులు తీస్తాడు. పరుగెడుతూ ఓ లోయలో పడిపోతాడు. కాపాడండి అని అరుస్తాడు. అటుగా వస్తున్న త్రిపుర వెళ్తుంది.
బాల లోయలో పడటం చూసి చేయి అందిస్తుంది. త్రిపురని చూసిన బాల తన బామ్మ మాటలు గుర్తు చేసుకొని తనని కాపాడేది బాల త్రిపుర సందరి అమ్మవారే అని ఊహించుకుంటాడు. అమ్మవారే తనని కాపాడటానికి వచ్చిందని అనుకొని చూస్తూ ఉండిపోతాడు. త్రిపురకు చేయి అందించడం త్రిపుర అతి కష్టం మీద బాలని కాపాడుతుంది. ఇక అనంత్, వాళ్ల నాన్న కొందరు బాల కోసం వెతుకుతారు. బాల బయటకు వచ్చి రాళ్లని తంటాడు. ఏమైందని త్రిపుర అడిగితే నన్ను కొట్టింది నాకు దెబ్బలు తగిలాయని కాళ్లకు చేతులకు తగిలిన గాయాలు చూపిస్తాడు. బాలని త్రిపుర ఓ చోట కూర్చొపెట్టి పసరు మందు తీసుకురావడానికి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: నీకు నాకు ఏ సంబంధం లేదు: మిథునని పుట్టింట్లో వదిలేసిన దేవా.. దేవాపై పిచ్చి ప్రేమలో భాను!