Women employees: ఉద్యోగం పురుష ల‌క్ష‌ణం.. అని పెద్ద‌లు పేర్కొన్నా.. మారిన ప్ర‌పంచ కాల మాన ప‌రిస్థితులు, ఆర్థిక స‌వాళ్ల నేప‌థ్యంలో మ‌హిళ‌లు(Women) కూడా ఉద్యోగాలు(Jobs) ప‌డుతున్నారు. దేశంలోని మ‌ధ్య‌త‌ర‌గ‌తి(Middle) కుటుంబాల్లో 80 శాతం మ‌హిళ‌లు ఉద్యోగాల్లో ఉన్నారు. పోటీ ప‌రీక్ష‌లు రాసి, రేయింబ‌వ‌ళ్లు చ‌దువుకుని.. ఉద్యోగాల వేటలో మ‌హిళ‌లు సైతం పోటీ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ మ‌హిళ‌లు ఉద్యోగులుగా ఉన్నారు. వైమానిక‌(Airforce), ఆర్మీ(Army), నేవీ(Nevy) స‌హా రైల్వే(Railway), ఆర్టీసీ(RTC), రెవెన్యూ, పోలీసు(Police) వంటి స‌వాళ్లు ఎదుర్కొనే రంగాల్లోనూ మ‌హిళ‌లు త‌మ ప్ర‌తిభ‌ను చూపిస్తున్నారు. ఉత్తమ ఉద్యోగులుగా ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్నారు. అయితే.. తాజాగా జ‌రిగిన ఓ అధ్య‌య‌నంలో మ‌హిళ‌లు ఉద్యోగాలు పొందేందుకు ఎంత ఉత్సాహంతో ముందుకు వ‌స్తున్నా.. అంతే వేగంగా వెన‌క్కి వెళ్లిపోతున్నార‌ని తెలిసింది. ఇది కొంత విచారించాల్సిన విష‌య‌మే అయినా.. నిజ‌మేన‌ని అంటున్నారు. `అసోచామ్‌` సంస్థ తాజాగా గ‌త మూడు మాసాల కాలంలో దేశ‌వ్యాప్తంగా ఢిల్లీ, పుణే, విశాఖ‌ప‌ట్నం, హైద‌రాబాద్‌, చెన్నై, తిరువ‌నంత‌పురం వంటి కీల‌క న‌గ‌రాల్లో చేప‌ట్టిన అధ్య‌య‌నంలో ఉద్యోగాలు పొందుతున్న మ‌హిళ‌ల్లో 34 శాతం మంది మ‌హిళా ఉద్యోగినులు మ‌ధ్య‌లోనే స‌ద‌రు ఉద్యోగాల‌ను వ‌దిలేస్తున్నార‌ని స్ప‌ష్ట‌మైంది. 


కార‌ణాలు ఏంటి? 


మ‌హిళ‌లు ఉద్యోగాల‌ను మ‌ధ్య‌లోనే విడిచి పెట్ట‌డానికి ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని అధ్య‌య‌నం వెల్ల‌డిం చింది. కుటుంబ బాధ్య‌త‌లు(Family responsibilities) ప్ర‌ధానంగా వీరిపై ప్ర‌భావం చూపుతున్నాయ‌ని తెలిపింది. అదేవిధంగా ప‌ని ఒత్తిళ్లు(Stress), ఉద్యోగుల మ‌ధ్య టార్గెట్ల‌ను చేరుకోక‌పోవ‌డం, మాన‌సికంగా అలిసిపోవ‌డం, కుటుంబ జీవితాల‌కు దూరం కావ‌డం వంటివి కూడా ప్ర‌ధాన కార‌ణాలుగా ఉన్నాయ‌ని పేర్కొంది. అదేస‌మ‌యంలో కుటుంబా న్ని, ఉద్యోగాన్ని స‌మ‌పాళ్ల‌లో నిర్వ‌హించే విష‌యంలో త‌డ‌బ‌డుతున్న ప‌రిస్థితి కూడా మ‌హిళ‌లు ఉద్యోగా ల‌ను మ‌ధ్య‌లోనే విడిచి పెట్ట‌డానికి కార‌ణంగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు.. బ‌దిలీలు కూడా మ‌హిళ‌లు ఉద్యో గాలు మానేసేందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఒక ప్రాంతంలో భార్యాభ‌ర్త‌లు ఉద్యోగాలు చేస్తున్న స‌మ యంలో మ్యూచువ‌ల్ ట్రాన్స్‌ఫ‌ర్స్ కాన‌ప్పుడు.. మ‌హిళ‌ను లేదా.. ఆమె భ‌ర్త‌ను బ‌దిలీ చేసిన‌ప్పుడు.. మ‌హిళలు ఒంట‌రిగా ఉంటూ.. ప‌నిచేయ‌లేనిప‌రిస్థితి సంభ‌విస్తోంది. దీంతో బ‌దిలీ చేయాల‌ని కోర‌డ‌మో.. దానికి అవ‌కాశం లేని సంద‌ర్భంలో ఉద్యోగాల‌ను వ‌దిలేయ‌డ‌మో చేస్తున్నారు. ఐటీ స‌హా అన్ని కంపెనీల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో మ‌రో కీల‌క విష‌యం.. వేధింపులు. ప్ర‌స్తుతం బ‌య‌ట‌ప‌డుతున్న ప‌నిప్రాంతాల్లో వేధింపుల ఘ‌ట‌న‌లు వాస్త‌విక ఘ‌ట‌న‌ల్లో 2శాతం మాత్ర‌మే ఉన్నాయ‌ని అధ్య‌య‌న క‌ర్త‌లు వెల్ల‌డించారు. మిగిలిన కేసుల్లో దాదాపు వెలుగు చూడ‌నివే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు. ఈ వేధింపుల‌ను త‌ట్టుకోలేని వారు కూడా.. ఉద్యోగాల‌ను వీడి పోతున్నారు. 


అవ‌కాశాలు ద‌క్కుతున్నా..


ఉద్యోగాల విష‌యంలో మ‌హిళ‌ల‌(Women)కు అవ‌కాశాలు ఎక్కువ‌గానే ల‌భిస్తున్నాయి. గత ఐదేళ్లలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య పెరిగింది. 15-49 ఏళ్ల మధ్య వివాహిత మహిళల్లో 32 శాతం మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో 83 శాతం మంది మంచి జీతం (Salary) తీసుకుంటున్నారు.  2022-23లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే  ప్రకారం 15-49 ఏళ్ల వివాహిత మహిళల్లో ఇంత‌కు మునుపు 31 శాతం మంది ఉద్యోగాలు చేస్తుండగా.. ఆ సంఖ్య 32 శాతానికి చేరింది.  ఇక, తమ సంపాదనపై సొంతంగా నిర్ణయాలు తీసుకునే మహిళల సంఖ్య మాత్రం 82 శాతం నుంచి 85శాతానికి పెరిగినట్లు తెలిపింది. ఐటీఈఎస్, బీపీవో రంగాల్లో గతేడాది క‌న్నా ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగింది. ఐటీ, కంప్యూటర్స్ రంగంలో కూడా మ‌హిళ‌ల ప్రాధాన్యం పెరిగింది. బ్యాంకింగ్, అకౌంటింగ్, ఆర్థిక సేవ రంగాల్లో గతేడాది  కంటే ప్ర‌స్తుతం ఈ సంఖ్య‌ పెరిగింది. నియామకాలు, స్టాఫింగ్, ఆర్పీవో రంగాల్లోనూ మ‌హిళ‌ల పాత్ర గ‌ణ‌నీయంగా పెరిగింది. అదేస‌మ‌యంలో వీరి భ‌ద్ర‌త‌కు ప్ర‌భుత్వాలు పెద్ద‌పీట వేస్తున్నాయ‌ని అధ్య‌య‌నం వెల్ల‌డించింది. రాష్ట్రంలో `దిశ‌` యాప్ త‌మ ఫోన్ల‌లో ఉన్న మ‌హిళా ఉద్యోగుల సంఖ్య 100శాతంగా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ యాప్‌ను వినియోగించుకున్న‌వారి సంఖ్య మాత్రం 3-5 శాతం మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం.