UPSC NDA Results 2022:  యూనియన్ సర్వీస్ పబ్లిక్ కమిషన్ (UPSC) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ (NA) ఎగ్జామినేషన్ (I) 2022 రాత పరీక్ష ఫలితాలను మే 9వ తేదీ సోమవారం ప్రకటించింది. అభ్యర్థుల పరీక్ష ఫలితాలను UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో చూడవచ్చు. 


UPSC ఏప్రిల్ 10, 2022న ఎన్డీఏ, ఎన్ఏ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఆర్మీ, నేవీలో అడ్మిషన్ కోసం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB) ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అర్హులు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎయిర్ ఫోర్స్ వింగ్స్ 149వ కోర్సు, 111వ ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సు (INAC) జనవరి 2, 2023 నుంచి ప్రారంభమవుతుంది. 


అభ్యర్థులు ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు :


1.  UPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి - khttps://upsc.gov.in/


2. హోమ్‌పేజీలో 'వాట్ ఈజ్ న్యూస్' పై క్లిక్ చేయండి


3. రిజల్ట్స్ : నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ (I) 2021 లింక్ క్లిక్ చేయండి


4. ఈ పేజీలో ఒక లింక్‌ కనిపిస్తుంది. 


5. ఫలితాలను తనిఖీ చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి


6. భవిష్యత్తు అవసరాల కోసం ఒక కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి


Also Read: తెలంగాణలో పోలీస్ జాబ్స్‌కు దరఖాస్తులు ప్రారంభం - డైరెక్ట్ లింక్, పోస్టుల అర్హతల వివరాలు ఇవే


తుది ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోగా అభ్యర్థుల మార్కుషీట్‌లు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. మరిన్ని అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు www.upsc.gov.inని చెక్ చేస్తూ ఉండండి.  NDA 1 ఫలితాలు ప్రకటించిన రెండు వారాల్లోగా అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ రిక్రూటింగ్ వెబ్‌సైట్ – joinindianarmy.nic.inలో ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. అర్హత సాధించిన అభ్యర్థులకు SSB ఇంటర్వ్యూ ఎంపిక కేంద్రాలు, తేదీ కేటాయిస్తారు. అవి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు తెలియజేస్తారు. ఇ-మెయిల్ ఐడీ ఇందులో పొందుపరచాలి. SSB ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు వయస్సు, విద్యార్హత అసలైన సర్టిఫికేట్‌లను సంబంధిత సర్వీస్ సెలక్షన్ బోర్డ్‌లకు (SSBs) సమర్పించాల్సి ఉంటుంది. SSB ఇంటర్వ్యూలు ముగిసిన తర్వాత తుది ఫలితాలను 15 రోజులలోపు అభ్యర్థుల మార్కుల షీట్‌లు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. 


Also Read : SBI Recruitment 2022: 35 పోస్టులతో ఎస్‌బీఐ నోటిఫికేషన్- అప్లై చేయడానికి మే 17 లాస్ట్ డేట్


Also Read : సైకిల్ వచ్చిన వాళ్లకు కేంద్రం గుడ్‌ న్యూస్- పరీక్ష లేకుండానే ఉద్యోగం