నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో జరిగిన సంఘటన నెల్లూరు జిల్లాలోనే కాదు. యావత్ ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. పెళ్లికి అంగీకరించలేదని యువతిపై కాల్పులు జరిగిన యువకుడు ఆమెను హత్య చేసిన అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. 


పోలీసులు అందించిన వివరాల ప్రకారం... నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన సురేష్‌ రెడ్డి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయి. అదే ఊరిలో ఉంటున్న కావ్య రెడ్డి కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఇద్దరూ బెంగళూరులోని ఉద్యోగాలు చేసే వాళ్లు. కరోనా కారణంగా ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్‌ హోం చేస్తున్నారు. 


ఒకే ఊరు, ఒకే ఫీల్డ్ కావడంతో కావ్యను చూసిన సురేష్‌ రెడ్డి ఇష్టపడ్డాడు. లవ్ చేశాడు. అయితే అమ్మాయి నుంచి మాత్రం అలాంటి స్పందన లేదు. పెళ్లి చేసుకోవాలని భావించిన ఇంట్లో వాళ్లతో విషయాన్ని చెప్పాడు. అయితే ఇంట్లో వాళ్లు కూడా ఓకే అనుకొని కావ్య వాళ్ల ఇంటికి వెళ్లి సురేష్‌కు కావ్యను ఇచ్చి పెళ్లి చేయాలని అడిగారు. 


సురేష్‌ చేష్టలను వాళ్ల ఇంట్లో ముందే చెప్పింది కావ్య. లవ్‌ పేరుతో తనను నిత్యం వేధించేవాడని... పిచ్చిపిచ్చి మెసేజ్‌లు చేసేవాడని చెప్పింది. ఫోన్‌లు చేసి సతాయించే వాడని కూడా వివరించింది. ఈ వేధింపులు ఎక్కువయ్యేసరికి ఒకర్రెండు సార్లు సురేష్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటివి చేస్తే పద్దతిగా ఉండదని కూడా చెప్పేశారు. అయినా సురేష్ తన పంథా మార్చుకోలేదు. 


సురేష్‌ సంగతి మొదటి నుంచి గమనించారు కావ్య ఫామిలీ మెంబర్స్‌. అందులోనూ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్‌ కూడా చాలా ఉంది. అలాంటి వ్యక్తికి కావ్యను ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడలేదు. సురేష్‌ రెడ్డి కుటుంబం తీసుకొచ్చిన పెళ్లి ప్రపోజల్‌ను కావ్య ఫ్యామిలీ రిజెక్ట్ చేశారు. ఇకపై ఇలాంటి ప్రపోజల్స్ తీసుకురావద్దని.. తమకు సురేష్‌పై మంచి అభిప్రాయం లేదని చెప్పేశారు.  


తాను తీసుకెళ్లిన పెళ్లి ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని కోపం పెంచుకున్నాడు సురేష్. రోజు రోజుకూ ఆ కోపం పగలా మారింది. చివరకు ఆమెతో తేల్చుకోవాలని డిసైడ్‌ అయ్యాడు. సోమవారం మధ్యాహ్నం జేబులో పిస్టల్‌ పెట్టుకొని కావ్య ఇంటికి వెళ్లాడు. మాట్లాడాలని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు. కావ్య ఆమె సిస్టర్ ఒక చోట ఉన్న ఉన్నటైంలో హడావుడి చేశాడు. పక్కనే ఉన్న ఆమె సిస్టర్‌ను నెట్టేసి కావ్యపైకి కాల్పులు జరిపాడు. 


గన్ తీసేసరికి కావ్య, ఆమె సిస్టర్‌ కాసేపు కంగారు పడిపోయారు. మొదటి రౌండ్ కాల్పులు జరిపాడు. ఎలాగోలా తప్పించుకుంది. ఆ బులెట్‌ పక్కనే ఉన్న మంచానికి తాకింది. రెండోసారి మరింత దగ్గరగా గన్‌ పెట్టి ట్రిగర్ నొక్కాడు. అంతే తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అంతే అక్కడికక్కడే పడిపోయింది కావ్య. 


అక్కడే ఉన్న కావ్య సిస్టర్‌... జరిగిన విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్‌కు వెళ్లి చెప్పింది. వాళ్లు వచ్చేసరికి రక్తపు మడుగులో కావ్య పడి ఉంది. వెంటనే ఆసుపత్రికి తరించారు. తరలిస్తున్న దారిలోనే కావ్య మృతి చెందింది. దీంతో ఆఫ్యామిలీ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. 


కావ్యపై కాల్పులు జరిపిన సురేష్‌ రెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. వేరే చోటుకు వెళ్లి కావ్యను చంపిన రివాల్వర్‌తో తనను తాను కాల్చుకున్నాడు. పాయింట్‌ బ్లాంక్‌లో గన్‌ పెట్టి కాల్చుకున్నాడు. అంతే స్పాట్‌లోనే చనిపోయాడు సురేష్ రెడ్డి.  


కావ్య హత్యకు ఉపయోగించిన గన్‌ ఎక్కడి నుంచి వచ్చిందనేది పోలీసులు విచారిస్తున్నారు. ఆ గన్‌పై మేడిన్ యూఎస్‌ఏ  అని రాసి ఉండటం కలకలం రేపుతోంది. సురేష్‌కు చెందిన రెండు మొబైల్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఆ రెండు మొబైల్స్‌ను విశ్లేషించిన తర్వాత గన్‌కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు పోలీసులు.