ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పాసైన వాళ్లకు ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది. 38, 926 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిజీల్ చేసింది. 


దేశవ్యాప్తంగా వివిధ పోస్టాఫీసుల్లో ఉన్న ఖాళీలతో నోటిఫికేషన్ జారీ చేసింది ఇండియన్ పోస్టల్ శాఖ. బ్రాంచ్‌ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్ మాస్టర్‌, డాక్‌ సేవక్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా బర్తీ చేయనుంది. 


ఈ ఉద్యోగాలకు పదో తరగతి పాసైన వాళ్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్థానిక భాషపై పట్టు ఉండాలి. సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. 18ఏళ్లు నిండి వాళ్లు 40 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్లంతా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మెరిట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 


ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు 12 వేల నుంచి పదివేల వరకు వేతనం ఇవ్వనుంది కేంద్రం. బ్రాంచ్‌ పోస్ట్ మాస్టర్‌ జాబ్‌కు సెలెక్ట్ అయిన ఉద్యోగికి 12వేలు ఇస్తారు. అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌, డాక్‌ సేవక్‌ ఉద్యోగులకు పదివేలు ఇస్తారు. 


లింక్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ముందుగా మీ వివరాలు అందించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తర్వాత ఫీజుల చెల్లించాలి. మూడో దశలో అప్లికేషన్ ఫిల్ చేయడం, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి సబ్‌మిట్ చేయాలి. 


జూన్‌ ఐదో తేదీలోపు అప్లికేషన్ పూర్తి చేసి పంపించాలి. అభ్యర్థులు వందరూపాయల ఫీజుల చెల్లించాల్సి ఉంటుంది. ఓబీసీ, జనరల్‌ అభ్యర్థులు మాత్రమే వందరూపాయల ఫీజు చెల్లించాలి. మిగిలిన వారంతా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.