సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పోస్టర్స్ విడుదల కాగా.. అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  


మే 12న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్ గానే తన పాత్ర డబ్బింగ్ ను పూర్తి చేసింది కీర్తి సురేష్. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను మహేష్ బాబుని మూడు సార్లు కొట్టానని చెప్పింది కీర్తి. 


మహేష్ బాబుతో షూటింగ్ చేయడం చాలా సరదాగా ఉంటుందని.. ఓ సాంగ్ షూటింగ్ సమయంలో తాను టైమింగ్ మిస్ అవ్వడంతో మహేష్ ని రెండు సార్లు రాంగ్ టైమింగ్ లో కొట్టానని చెప్పింది. మూడోసారి కూడా టైమింగ్ మిస్ అయ్యానని కీర్తి తెలిపింది. మహేష్ కి పదే పదే సారీ చెప్పానని.. అతడు ఆ విషయాన్ని కూల్ గా తీసుకున్నా.. 'నాపై ఏమైనా కోపం ఉందా..?' అంటూ సరదాగా అడిగారని చెప్పుకొచ్చింది. 


మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 


Also Read: విశ్వక్ సేన్ ‘F’ వర్డ్, మంత్రి తలసానికి ఫిర్యాదు చేసిన టీవీ యాంకర్, చర్యలు తప్పవా?