Suicide Prank Gone Wrong: ఎక్కడ? అర్జున్ కుమార్ అల్లం ఎక్కడ? అంటూ నడి రోడ్డు మీద ఒక యువకుడు హల్ చల్ చేశాడు. యంగ్ హీరో విశ్వక్ సేన్ కారు ముందు పడ్డాడు. 30 ఏళ్ళు వచ్చినా అర్జున్ కుమార్ అల్లానికి పెళ్లి కాకపోవడం ఏమిటి? అతడిని నా దగ్గరకు తీసుకురండి లేదంటే నన్ను అతడి దగ్గరకు తీసుకు వెళ్ళండి లేదంటే అంటించేయండి (ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నట్టు కలరింగ్ ఇస్తూ వాటర్ పోసుకున్నాడు) అంటూ రోడ్డు మీద రచ్చ రచ్చ చేశాడు. అతడిని తన కారులో పంపిన విశ్వక్ సేన్, తాను ఆటో ఎక్కి వెళ్లిపోయారు. రెండు రోజులుగా యూట్యూబ్, సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.
'అశోక వనంలో అర్జున కళ్యాణం'లో విశ్వక్ సేన్ క్యారెక్టర్ పేరు అర్జున్ కుమార్ అల్లం. సినిమా కథ ఏంటంటే... 30 ఏళ్ళు వచ్చిన హీరోకి పెళ్లి కాదు. అవ్వక అవ్వక చాలా రోజులకు పెళ్లి కుదిరితే... అది కూడా క్యాన్సిల్ అవుతుంది. సినిమా పబ్లిసిటీలో భాగంగా పైన చెప్పిన ప్రాంక్ వీడియో చేశారు. అయితే, ఆ వీడియో మీద కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ పేరుతో రోడ్డు మీద రచ్చ ఏంటని మానవ హక్కుల కమిషన్ (హెచ్ ఆర్ సి)కి ఒకరు ఫిర్యాదు చేశారు.
అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ ఒకరు విశ్వక్ సేన్ మీద హెచ్ఆర్‌సిలో ఫిర్యాదు చేశారట. అభిమాని సూసైడ్ పేరుతో ప్రాంక్ వీడియో చేసిన విశ్వక్ మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్టు సమాచారం. అలాగే, పబ్లిక్ ప్లేస్‌లలో సినిమా ప్రమోషన్స్ చేయకుండా చూడాలని కోరారట. ప్రమోషన్స్ పేరిట న్యూసెన్స్ చేశారని అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఒక టీవీ ఛానల్ డిబేట్ పెట్టగా... విశ్వక్ సేన్ ఆ ఛానల్ స్టూడియోకి వెళ్లారు. ఛానల్ ప్రతినిథికి, ఆయనకు మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. విశ్వక్ సేన్ ను స్టూడియో నుంచి గెటవుట్ అనే వరకూ వెళ్ళింది.
Also Read: చిరంజీవి సినిమా నుంచి రవితేజను తీసేశారా? లేదంటే తప్పించారా?
'అశోక వనంలో అర్జున కళ్యాణం' (Ashoka Vanam Lo Arjuna Kalyanam movie) చిత్రానికి విద్యా సాగర్ చింతా దర్శకుడు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో... ఎస్‌విసిసి డిజిటల్ పతాకంపై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'రాజావారు రాణీగారు' చిత్రదర్శకుడు రవికిరణ్ కోలా కథ అందించారు. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం సమకూరుస్తున్నారు. మే 6న సినిమా విడుదల కానుంది.
Also Read: ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగొచ్చిన బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర, అసలు ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటే?