LIC IPO: ఎల్‌ఐసీ మెగా పబ్లిక్‌ ఇష్యూ (LIC IPO) ప్రారంభమైంది. ఈరోజు నుంచి ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 9 వరకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే సోమవాం యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన భాగానికి భారీ స్పందనే వచ్చింది. దీంతో మెగా ఐపీఓపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.


డిస్కౌంట్


ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ ధరల శ్రేణి రూ.902-949గా ప్రకటించారు. అయితే పాలసీదార్లకు రూ.60, రిటైలర్లు, ఉద్యోగులకు రూ.45 చొప్పున డిస్కౌంటు ఇస్తున్నారు.  రూ.902-949 ధర వద్ద ఐపీఓ విలువను చూస్తుంటే 2021-22 ప్రైస్‌ టు ఎంబెడెడ్‌ వేల్యూ(పీ/ఈవీ) విలువకు 1.1 రెట్లు ఉంది. మొత్తం మీద ఆకర్షణీయ విలువలు, భారీ ఆస్తులు, బలమైన బ్రాండ్‌ విలువ వంటి వాటి వల్ల ఎల్‌ఐసీ ఐపీఓకు ఎక్కువ మంది మొగ్గుచూపొచ్చు.


LICలో 3.5 శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.21,000 కోట్లతో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. మే 4న మొదలైన ఇష్యూ ఈ నెల 9న ముగుస్తుంది. భారత్‌ స్టాక్‌ మార్కెట్లలో అతిపెద్ద ఇష్యూ ఇదే కావడం గమనార్హం. ఐపీవోకు దరఖాస్తు చేసేవారు కొన్ని కీలక వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.


సబ్‌స్క్రిప్షన్‌ తేదీ: ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ 2022, మే4, బుధవారం మొదలైంది. మే 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రైస్‌ బ్యాండ్‌ : ఎల్‌ఐసీ షేర్ల ధర రూ.902 - 949గా నిర్ణయించారు. ఒక్కో షేరు ఫేస్‌ వాల్యూ రూ.10గా ఉండనుంది. పాలసీ హోల్డర్లకు  రూ.60, రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ.45 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు.


అప్పర్‌ బ్యాండ్‌ ధరకు ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు సమీకరించనుంది. ఇది మొత్తంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ఐపీవో. 221,374,920 ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. మొత్తం ఆఫర్లో 50 శాతం క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లు, 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లు, మిగిలిన 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు రిజర్వు చేశారు.


ఎల్‌ఐసీ ఐపీవోలో కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెడతాయని తెలుస్తోంది. ఎస్‌బీఐ, ఆదిత్యా బిర్లా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ వంటి మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు కనీసం రూ.150 నుంచి రూ.1000 కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక 70 లక్షల వరకు రిటైల్‌ అప్లికేషన్లు వస్తాయని అంటున్నారు. గతేడాది భారత ఈక్విటీ మార్కెట్లలో నమోదైన ఇష్యూలతో పోలిస్తే సగటున ఐదు రెట్లు ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుందట.


Also Read: LIC IPO: ఎల్‌ఐసీ షేర్లు కొంటున్నారా? మరి ఈ వివరాలు పరిశీలించారా.. లేదంటే!!


Also Read: LIC IPO: ఎల్‌ఐసీలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడి ఆ రేంజ్‌లో ఉందా?