UPSC Civil Services Prelims Exam 2024 Postponed: దేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ)-2024, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2024 ప్రిలిమినరీ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) వాయిదా వేసింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా మే 26న జరగాల్సిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 16న నిర్వహించనున్నట్లు యూపీఎస్​సీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఐఏఎస్,ఐసీఎస్,ఐఎఫ్ఎస్ సహా 23 సర్వీసుల్లో నియాకం కోసం ఏటా యూపీఎస్సీ..సివిల్​ సర్వీసెస్​ పరీక్షలను ఏటా ప్రిలిమినరీ, మెయిన్​, ఇంటర్వ్యూ అని మూడు దశల్లో నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా 1,056 ఉద్యోగాలు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు.  



సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) - 2024 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఫిబ్రవరి 14న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్‌ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 6  వరకు దరఖాస్తులు స్వీకరించారు. మార్చి 6 నుంచి 12 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్‌తోపాటే ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్‌-2024 నోటిఫికేషన్‌ను కూడా యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఫిబ్రవరి 14న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఫారెస్ట్ సర్వీసెస్‌లోని వివిధ పోస్టులను భర్తీచేయనున్నారు.


యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆధారంగా మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికచేస్తారు. మార్చి 6 నుంచి 12 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. తాజాగా మారిన షెడ్యూలు ప్రకారం మే 26న నిర్వహించాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను జూన్ 16న నిర్వహించనున్నారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షనే దీనికి కూడా ప్రామాణికంగా భావిస్తారు. మెయిన్ పరీక్షను మాత్రం విడిగా నిర్వహిస్తారు. తదనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికచేస్తారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 


ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతుంటారు. గతేడాది 1105 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలకాగా.. ఈ ఏడాది 1056 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. వీటిల్లో 40 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. మిగిలిన ఖాళీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి గరిష్గంగా 6 సార్లు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఓబీసీ, దివ్యాంగులక 9 సార్లు అవకాశం ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా పరీక్ష రాయడానికి అర్హులు.


సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2024 వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2024 వివరాల కోసం క్లిక్ చేయండి..


ప్రిలిమ్స్ పరీక్ష విధానం: 
మొత్తం 400 మార్కులకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.


ALSO READ: ఎన్నికల తేదీల్లో ప్రవేశ, నియామక, పోటీ పరీక్షలు - విద్యార్థులు, అభ్యర్థుల్లో ఆందోళన


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..