TS Police Jobs : తెలంగాణలో పోలీస్ కొలువులకు భారీ స్పందన వచ్చింది. ఇటీవల పోలీస్ నియామక మండలి విడుదల చేసిన నోటిఫికేషన్ కు 7.33 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేశారు. మొత్తం 12.91 లక్షల దరఖాస్తులు చేసుకున్నట్లు రిక్రూట్మెంట్ సెల్ పేర్కొంది. ఈ దరఖాస్తుల్లో ఎస్ఐ పోస్టులకు 2.47 లక్షలు, కానిస్టేబుల్‌ పోస్టులకు 9.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని నియామక మండలి స్పష్టంచేసింది. 3.55 లక్షల మంది అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలకు అప్లై చేసినట్లు తెలిపింది. ఈ దరఖాస్తుల్లో 2.76 లక్షల మంది మహిళా అభ్యర్థులు అప్లై చేశారు. అయితే ఆగస్టు 7వ తేదీన ఎస్ఐ, 21న కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష తేదీల్లో ఏమైనా మార్పులు ఉంటే ముందుగా ప్రకటిస్తామని పోలీస్ రిక్రూట్మెంట్ మండలి ఛైర్మన్‌ శ్రీనివాస్‌ రావు అన్నారు.


మొత్తం దరఖాస్తుల్లో 



  • ఓసీలు - 7.65% 

  • బీసీ(ఏ) - 8.27%, 

  • బీసీ(బీ)- 17.7%, 

  • బీసీ(సీ)-0.26%, 

  • బీసీ (డీ)-20.97%, 

  • బీసీ (ఈ)-4.11% , 

  • ఎస్సీ-22.44 % , 

  • ఎస్టీ-18.6% 


హైదరాబాద్ జిల్లా నుంచి అత్యధిక దరఖాస్తులు వచ్చాయని నియామక మండలి పేర్కొంది. ఆ తర్వాత రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట్, జనగాం, సిరిసిల్ల జిల్లాల నుంచి తక్కువ సంఖ్యలో అప్లై చేసుకున్నారు. తెలుగులో పరీక్ష రాసేందుకు 67 శాతం మంది అభ్యర్థులు, ఇంగ్లీష్ లో రాసేందుకు 32.8 శాతం మంది ఆప్షన్‌ ఎంచుకున్నారని నియామక మండలి పేర్కొంది.


17 వేల పోస్టులు


తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తులు మే 2న ప్రారంభమయ్యాయి. మొత్తం 17,291 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో కానిస్టేబుల్ పోస్టులు 16,027 ఉండగా, ఎస్ఐ పోస్టులు 587ను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) భర్తీ చేయనుంది. పోలీసు ఎక్సైజ్, రవాణా విభాగంలో 677 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి.  ఈ ఉద్యోగాలన్నింటికి దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయింది. పోలీస్ పోస్టులకు మే 2న అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా, మే 20 రాత్రి తుది గడువు ముగిసింది. 


Also Read : TS Govt Jobs Process : గ్రూప్-1లో 19 రకాల పోస్టులు, ఉద్యోగాల భర్తీ, పరీక్షా విధానాలపై ఉత్తర్వులు