తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 60 వేలకు పైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. కరోనా ప్రభావం, జోనల్ వ్యవస్థ, పోస్టుల వర్గీకరణ, ఎన్నికలు వంటి పలు కారణాలతో మూడున్నర ఏళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదు. దీంతో నిరుద్యోగులంతా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.


కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడం, జోనల్ వ్యవస్థకు ప్రభుత్వం ఓకే చెప్పడంతో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సైతం ప్రకటన చేశారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఉద్యోగ ఖాళీలను గుర్తించే పనిలో పడ్డాయి. 


ఆగస్టు 15 లోపు నోటిఫికేషన్..
రాష్ట్ర వ్యాప్తంగా 60 వేలకుపైగా ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వ శాఖలు గుర్తించాయి. దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదికను కూడా అందించాయి. ఈ వివరాలను మంత్రి మండలి సమావేశంలో సమర్పించనున్నట్లు తెలిసింది. జోనల్‌ విధానానికి అనుగుణంగా పోస్టులు, ఖాళీలతో గుర్తించి ఇచ్చిన ఈ వివరాలను సీఎం, మంత్రులు పరిశీలించనున్నారు. వీరు ఆమోదం తెలిపాక ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. ఆగస్టు 15వ తేదీ కల్లా ఏదైనా ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం యోచనలో ఉన్నట్లు తెలిసింది. 


Also Read: మైనారిటీ జూనియర్ కాలేజీల్లో 840 జేఎల్ పోస్టులు..


ఏపీలో 1180 జాబ్స్.. 
ఆంధ్రప్రదేశ్‌లో 1180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. వీటి భర్తీ ప్రక్రియ చేపట్టాల్సిందిగా ప్రభుత్వం ఏపీపీఎస్సీని ఆదేశించింది. జాబ్‌ క్యాలెండర్‌లో ఈ పోస్టులను చేర్చాలని సూచించింది. విభాగాల వారీగా జారీ చేసే పోస్టుల వివరాలను సైతం వెల్లడించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ పోస్టులకు  సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పోస్టులకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని పేర్కొంది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్టులో వచ్చే అవకాశం ఉంది. 


యునానీ విభాగంలో మెడికల్ ఆఫీసర్- 26, ఆయుర్వేద విభాగంలో మెడికల్ ఆఫీసర్-  72, హోమియోపతి విభాగంలో మెడికల్ ఆఫీసర్- 53, హోమియో విభాగంలో లెక్చరర్ పోస్టులు- 24, ఆయుష్‌ విభాగం డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌‌జీఏసీలో లెక్చరర్‌- 3, జూనియర్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ అసిస్టెంట్‌- 670, అసిస్టెంట్ ఇంజనీర్లు- 190, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు గ్రేడ్ 3 (ఎండోమెంట్)- 60, హార్టికల్చర్ ఆఫీసర్- 39, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- 4, తెలుగు రిపోర్టర్ (లెజిస్లేచర్)- 5, ఇంగ్లిష్ రిపోర్టర్ (లెచిస్లేచర్)- 10, జూనియర్ లెక్చరల్ ఏపీఆర్ఈఐ సొసైటీ- 10, డిగ్రీ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ- 5, అసిస్టెంట్ కన్జర్వేటర్, ఫారెస్టు సర్వీస్- 9 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.


మరింత చదవండి: ఏపీలో 1180 జాబ్స్.. కేటగిరీల వారీగా వివరాలివే..