ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL - 2021) టైర్-1 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 16న  విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్‌కీతోపాటు క్వశ్చన్ పేపర్‌ను కూడా కమిషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ, క్వశ్చన్ పేపర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబరు 15 వరకు ఆన్సర్ కీ, ప్రశ్నపత్రం అందుబాటులో ఉంటుంది. 


SSC CHSL టైర్-1 ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి...
 


కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్‌ఈ)-2021 'టైర్-1' ఫలితాలను ఆగస్టు 4న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు టైర్-2 (డిస్క్రిప్టివ్) పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 5న ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 18న టైర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. ఇక టైర్-2 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు టైర్-3(స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్) నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. టైర్-1 పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో మొత్తం 54,092 మంది టైర్-2 పరీక్షకు ఎంపికయ్యారు.


TIER-I Result    |    Cut-off Marks


 


కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్ -2021 ఖాళీల వివరాలను స్టాఫ్ సెలక్షన్ ఆగస్టు 5న విడుదల చేసింది. దీనిప్రకారం మొత్తం 6,072 పోస్టులను భర్తీచేయనుంది. వీటిలో జనరల్-2924, ఓబీసీ-1049, ఎస్సీ-990, ఎస్టీ-469, ఈడబ్ల్యూఎస్-640 పోస్టులు ఉన్నట్లు ప్రకటించింది. వీటిల్లో ఎక్స్-సర్వీస్‌మెన్-577, దివ్యాంగులకు-36, OH-58, HH-64, VH-58 పోస్టులు కేటాయించారు. 


 


Also Read: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!


 


ఆన్సర్ కీ ఇలా చెక్ చేసుకోండి..

★ ఆన్సర్ కీ కోసం అభ్యర్థులు మొదట స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. 

★ అక్కడ హోంపేజీలో Latest News విభాగంలో కనిపించే 'CHSL Examination, 2021 (Tier-I) Final Answer Keys' లింక్‌పై క్లిక్ చేయాలి.

★ క్లిక్ చేయగానే ఆన్సర్ కీకి సంబంధించిన వివరాలతో PDF ఫైల్ ఓపెన్ అవుతుంది.

★ PDFలో కింది భాగంలో ఉన్న 'Click here for Final Answer Keys alongwith Question Paper' లింక్ పై క్లిక్ చేయాలి.

★ అభ్యర్థి నమోదు చేయాల్సిన వివరాలతో కూడిన లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.

★ ఆ పేజీలో అభ్యర్థి తన రూల్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి 'Login' బటన్‌పై క్లిక్ చేయాలి.

★ క్లిక్ చేయగానే ఆన్సర్ కీతోపాటు ప్రశ్నపత్రం కూడా తెరపై దర్శమిస్తాయి. 

★ వాటిని డౌన్‌లోడ్ చేసుకొని, తదుపరి అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

★ ఆన్సర్ కీతో తన సమాధానాలను చెక్ చేసుకోవచ్చు. మార్కులపై ఓ అంచనాకు రావొచ్చు.


 


Also Read: ఏపీలో 2,318 పారా మెడికల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!!


 


ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్ (10+2) - ఎగ్జామ్‌ 2021


ఈ పరీక్షల ద్వారా కేంద్రప్రభుత్వంలోని వివిధ సర్వీసుల్లో వివిధ పోస్టులను భర్తీ చేస్తారు. మూడు దశల పరీక్షల ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. పోస్టులవారీగా విద్యార్హతలు ఉంటాయి. 



భర్తీ చేసే పోస్టులు..



1) ఎల్‌డీసీ/ జూనియర్‌ సెక్రటేరియట్ అసిస్టెంట్‌



2) పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌



3) డేటా ఎంట్రీ ఆపరేటర్‌



అర్హత‌లు:

ఎస్ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 12వ తరగతి పాసైన అభ్యర్థులు అర్హులు. పరీక్షలో నమోదు చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.



ఎంపిక ప్రక్రియ:

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (టైర్‌ -1, టైర్‌-2), స్కిల్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌ (టైర్‌-3) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.



దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.



దరఖాస్తు ఫీజు:

ఇతరులకు రూ.100.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.



ముఖ్యమైన తేదీలు:


★ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 1, 2022


★ దరఖాస్తులకు చివరితేది: మార్చి 7, 2022


★ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరితేది: మార్చి 8, 2022


★ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (టైర్‌-1): మే 24 - జూన్ 10, 2022


★ టైర్‌-2 పరీక్ష (డిస్క్రిప్టివ్‌ పరీక్ష): సెప్టెంబరు 18న (ఆగస్టు 5న ప్రకటించారు)


★ టైర్‌-3 పరీక్ష (స్కిల్ టెస్ట్): తర్వాత ప్రకటిస్తారు.


 


Also Read: SSC JE 2022: జూనియర్ ఇంజినీర్ నోటిఫికేషన్ వచ్చేసింది, అర్హతలు ఇవే!


 


CHSL Examination 2021 పరీక్షల స్వరూపం:


'టైర్-1' పరీక్ష విధానం..


మొత్తం 200 మార్కులకు టైర్-1 ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.


➦ మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వే్జ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు-50 మార్కులు.


➦ పరీక్ష సమయం 60 నిమిషాలు (గంట). నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నవారికి 80 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది.


➦ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.


➦ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు.


 


'టైర్-2' పరీక్ష విధానం..


టైర్-1 పరీక్షలో అర్హత సాధించినవారికి టైర్-2 (డిస్క్రిప్టివ్) పరీక్ష నిర్వహిస్తారు.


➦ 100 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. పెన్, పేపర్ విధానంలో పరీక్ష ఉంటుంది.


➦ పరీక్షలో భాగంగా 200-250 పదాలతో వ్యాసం (ఎస్సే), 150-200 పదాలతో లెటర్ లేదా అప్లికేషన్ రాయాల్సి ఉంటుంది.


➦ పరీక్ష సమయం 60 నిమిషాలు (గంట). నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నవారికి 20 నిమిషాల అదనపు సమయం కేటాయిస్తారు.


➦ కనీస అర్హత మార్కులు 33గా నిర్ణయించారు.


 


'టైర్-3' పరీక్ష విధానం..


➦ టైర్-2 పరీక్షలో అర్హత సాధించినవారికి టైర్-3 (స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.


➦ కంప్యూటర్‌లో టైపింగ్ చేయాల్సి ఉంటుంది.


➦ పోస్టుల వారీగా స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ వేర్వేరుగా ఉంటుంది.


 


 


మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...