హైదరాబాద్‌లోని సనత్ నగర్ ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు; సీనియర్, జూనియర్ కన్సల్టెంట్లు, స్పెషలిస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 25 నుంచి 28 వరకు విభాగాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 40
1) సీనియర్ రెసిడెంట్: 29 పోస్టులు
విభాగాలు: అనస్తీషియా, రేడియోలజీ, కార్డియాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ క్రిటికల్ కేర్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, సీటీవీఎస్.
అర్హతలు: వైద్య విద్యాసంస్థల నిబంధనలను అనుసరించి నిర్ణీత అర్హతలు, అనుభవం ఉండాలి. ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ అర్హత ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో పీజీ అర్హతతో 11 సంవత్సరాలు (లేదా) ఆరేళ్ల ఎంసీహెచ్/డీఎన్ డిగ్రీతో 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.
2) సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్)/సీనియర్ కన్సల్టెంట్: 05 పోస్టులు
విభాగాలు: కార్డియాలజీ, సీటీవీఎస్, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ.
అర్హతలు: ఎంబీబీఎస్. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో పీజీ అర్హతతో 11 సంవత్సరాలు (లేదా) ఆరేళ్ల ఎంసీహెచ్/డీఎన్ డిగ్రీతో 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.
3) సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవల్)/జూనియర్ కన్సల్టెంట్: 03 పోస్టులు
విభాగాలు: కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ.
అర్హతలు: ఎంబీబీఎస్. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో పీజీ అర్హతతో 5 సంవత్సరాలు.
4) స్పెషలిస్ట్: 03 పోస్టులు
విభాగాలు: అనస్తీషియా, రేడియోలజీ.
అర్హతలు: ఎంబీబీఎస్. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో పీజీ అర్హతతో 3 సంవత్సరాలు లేదా పీజీ డిప్లొమా అర్హత ఉన్నవారికి 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్)/సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవల్) పోస్టులకు 69 సంవత్సరాలు, స్పెషలిస్ట్ పోస్టులకు 66 సంవత్సరాలు, సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 45 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
వాక్‌ఇన్ తేదీ: ఏప్రిల్ 25 - 28 వరకు.
వాక్‌ఇన్ ఇంటర్వ్యూ వేదిక:
Chamber of Medical Superintendent,
ESIC Super Speciality Hospital,
Sanathnagar, Hyderabad.
ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిన వారు తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు..
➥ రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
➥ పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి లేదా బర్త్ సర్టిఫికేట్.
➥ గుర్తింపు కార్డు (పాన్ కార్డు/పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు)
➥ నివాస ధ్రువీకరణ (రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు)
➥ పదోతరగతి లేదా తత్సమాన సర్టిఫికేట్
➥ విద్యార్హత ధ్రువపత్రాలు.
➥ మెడికల్ కౌన్సిల్ సభ్యత్వ సర్టిఫికేట్
➥ రిజర్వేషన్ సర్టిఫికేట్ (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్)
➥ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్
➥ ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి.
➥ అవసరమైన ఇతర డాక్యుమెంట్లు
Also Read:
అణుశక్తి విభాగంలో 65 జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ముంబయితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న డీపీఎస్ యూనిట్లలో జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/ జూనియర్ స్టోర్ కీపర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 22 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
CIPET: సీపెట్‌లో 38 సూపర్‌వైజరీ & నాన్-సూపర్‌వైజరీ పోస్టులు
చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్ దేశవ్యాప్తంగా సీపెట్ కేంద్రాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 38 సూపర్‌వైజరీ, నాన్-సూపర్‌వైజరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 29 వరకు ఆఫ్‌లైన్ విధానంలో సంబంధిత చిరునామాకు దరఖాస్తులు పంపాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సర్కిళ్ల పరిధిలో నియమిస్తారు. ఎంపిక విధానంలో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టీసియన్స్‌గా పనిచేస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..