తెలంగాణ ప్రభుత్వం రెండో విడత 'కంటి వెలుగు' కోసం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అవసరమయ్యే సిబ్బంది కోసం ప్రత్యేక నియామకాలు చేపట్టనుంది. ఇందులో భాగంగా పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ల నియామకానికి డిసెంబరు 1న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా జిల్లా అధికారిక వెబ్‌సైట్లలో నోటిఫికేషన్లను అందుబాటులో ఉంచారు. ఈ నియామక బాధ్యత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు.

రెండేళ్ల డిప్లొమా (DOA/DOM). పారామెడికల్ బోర్డులో సభ్యత్వం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు దరఖాస్తు నింపి, సంబంధిత జిల్లా ఆరోగ్య (DMHO) కార్యాలయంలో డిసెంబరు 5న నిర్వహించే వాక్-ఇన్ ఇంటర్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. డిసెంబరు 5న వాక్ఇన్ నిర్వహించనున్నారు. కంటి వెలుగు కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 

Common Application Form

అర్హతలు: రెండేళ్ల డిప్లొమా (DOA/DOM). పారామెడికల్ బోర్డులో సభ్యత్వం ఉండాలి.

జీతం:
 నెలకు రూ.30,000.

➥కంటి వెలుగు నిర్వహించే ఒక్కో క్యాంపులో ఒక మెడికల్‌ ఆఫీసర్‌, ఒక ఆప్టో మెట్రీషియన్‌, 6-8 మంది సహాయ సిబ్బంది (ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్సులు, సూపర్‌ వైజర్‌, ఆశ వంటివారు) ఉంటారు. ప్రతి బృందానికి ఒక వాహనం కేటాయిస్తారు.

➥ ఒక రోజులో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో క్యాంపులో 300 మంది, పట్టణ ప్రాంతాల్లో 400 మందిని పరీక్షిస్తారని అంచనా.

➥ రద్దీకి అనుగుణంగా అదనపు క్యాంపులు నిర్వహించేందుకు జిల్లాకు అదనంగా 4-6 మంది మెడికల్‌ ఆఫీసర్లు లేదా ఆప్టో మెట్రీషియన్లు అందు బాటులో ఉంటారు.

➥ గ్రామీణ పీహెచ్‌సీల్లో, పట్టణాల్లో వార్డుల వారీగా క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ముఖ్యమైన తేదీలు...

➥ డిసెంబర్ 1న: నోటిఫికేషన్ వెల్లడి

➥ డిసెంబరు 5న: ఇంటర్వ్యూ నిర్వహణ.

➥ డిసెంబరు 7న: ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల, అభ్యంతరాలకు ఆహ్వానం.

➥ డిసెంబరు 8న: మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు చివరితేది. 

➥డిసెంబరు 10న: ఎంపికైన అభ్యర్థుల తుది మెరిట్ జాబితా వెల్లడి. 

జిల్లాలవారీగా వెబ్‌సైట్లు..

District Proposed Teams
Adilabad 33
Hanumakonda 45
Hyderabad 115
Jagtial 46
Jangaon 26
Jayashankar Bhupalpally 25
Jogulamba Gadwal 25
Kamareddy 44
Karimnagar 48
Khammam 55
Kumuram Bheem 26
Mahabubabad 38
Mahabubnagar 45
Mancherial 40
Medak 40
Medchal-Malkajgiri 75
Mulugu 20
Nagarkurnool 50
Nalgonda 74
Narayanpet 24
Nirmal 32
Nizamabad 70
Peddapalli 34
Rajanna Sircilla 26
Rangareddy 75
Sangareddy 69
Siddipet 45
Suryapet 50
Vikarabad 42
Wanaparthy 28
Warangal 44
Yadadri Bhuvanagiri 34
Total 1491

 

Also Read:

గ్రూప్-4' నోటిఫికేషన్ వచ్చేసింది - 9168 ఉద్యోగాల భర్తీ షురూ!
రాష్ట్రంలో 9168 గ్రూప్-4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చేఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవలే ఈ పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో గెజిటెడ్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
తెలంగాణలోని ప్రభుత్వ భూగర్భజల విభాగంలో గెజిటెడ్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 6 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 2023 మార్చి లేదా ఏప్రిల్ నెలలో పరీక్ష నిర్వహిస్తారు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో నాన్-గెజిటెడ్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణలోని ప్రభుత్వ భూగర్భజల విభాగంలో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 7 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 2023 మార్చి లేదా ఏప్రిల్ నెలలో పరీక్ష నిర్వహిస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...