రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. విద్యార్థులకు ఓ మంచి అవకాశం అందిస్తోంది. విద్యార్థులకు, గ్రాడ్యుయేట్ ఫ్రెషర్లకు సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 2022 నుంచి ప్రారంభిస్తామని వెల్లడించింది. అయితే ఇంటర్న్ షిప్ చేసేందుకు ఫైనాన్స్, ఎకనామిక్స్, లా, బ్యాంకింగ్‌లలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. వారే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఇంటర్న్‌షిప్ ప్రొగ్రామ్‌కు కోసం దరఖాస్తు చేసుకునే వారు.. డిసెంబర్ 31, 2021 వరకు అవకాశం ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. మొత్తం 125 మంది ఇంటర్న్‌లను ఎంపిక చేస్తారు. వారికి రూ.20,000 స్టైఫండ్ కూడా ఇస్తారు. వసతి ఏర్పాట్లను స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
విద్యార్థులు వారి చివరి సంవత్సరం/సెమిస్టర్ సమయంలో వేసవి ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది.
విదేశీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విదేశాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో ఫైనాన్స్, బ్యాంకింగ్, ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, లా (ఐదేళ్ల ప్రోగ్రామ్) చేసి ఉన్నవారు అర్హులు. దరఖాస్తు తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. 2022 జనవరి లేదా ఫిబ్రవరిలో ఇండియాలోని ఏదైనా ఆర్బీఐ ఆఫీసులో ఇంటర్వ్యూ ఉంటుంది.
ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్‌కు అర్హత ఉన్న భారతీయ విద్యార్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తు ఫారం నింపాలి. అనంతరం సమ్మర్ ప్లేస్‌మెంట్ కోసం తమ సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా “భారతీయ రిజర్వ్ బ్యాంక్ నియంత్రణ కార్యాలయాలకు” దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అర్హత ఉన్న విదేశీ విద్యార్థులు దరఖాస్తును పూర్తి చేసి.. మెయిల్ చేయాలి.
చీఫ్ జనరల్ మేనేజర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ట్రైనింగ్ & డెవలప్‌మెంట్ డివిజన్),
సెంట్రల్ ఆఫీస్,
21వ అంతస్తు,
సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్,
షాహిద్ భగత్ సింగ్ రోడ్,
ముంబై - 400 001
దరఖాస్తు.. ముందస్తు కాపీని cgminchrmd@rbi.org.in కు ఈ-మెయిల్ కూడా చేయవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ డిసెంబర్ 31, 2021 వరకు ఉంది.
Also Read: BEL Recruitment 2021: మచిలీపట్నం 'బెల్'లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలంటే..
Also Read: నాడు ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్.. నేడు పెన్సిల్వేనియా వర్సిటీ తొలి మహిళా ప్రెసిడెంట్