హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా రిసెర్చ్ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్, రిసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, జనవరి 29తో దరఖాస్తు గడువు ముగియనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అభ్యర్థుల్లో కాన్‌స్టిట్యూషన్ లా, కన్జ్యూమర్ లా, కార్పొరేట్ లా, ఎయిర్ & స్పేస్ లా, టాక్సేషన్, క్రిమినల్ లా, ఫోరెన్సిక్ సైన్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ బిజినెస్ లా, మారిటైమ్ లా, డిఫెన్స్ స్టడీస్, సైబర్ సెక్యూరిటీ, ల్యాండ్ లా విభాగాల్లో అనుభవం లేదా ఇంటర్న్‌షిప్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. పబ్లికేషన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఆ వివరాలను తప్పనిసరిగా నమోదుచేయాల్సి ఉంటుంది .


పోస్టుల వివరాలు..


మొత్తం ఖాళీల సంఖ్య: 12


1) రిసెర్చ్ అసోసియేట్: 06 పోస్టులు


అర్హతలు: 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో ఎల్‌ఎల్‌ఎం, ఎంఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రిసెర్చ్ పబ్లికేషన్స్ (SCOPUS, SCImago, వెబ్ ఆఫ్ సైన్స్, యూజీసీ కేర్ లిస్టెడ్ జర్నల్స్‌) ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.


2) రిసెర్చ్ అసిస్టెంట్: 06 పోస్టులు


అర్హతలు: అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో ఎల్‌ఎల్‌బీ, బీఎల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రిసెర్చ్ పబ్లికేషన్స్ (SCOPUS, SCImago, వెబ్ ఆఫ్ సైన్స్, యూజీసీ కేర్ లిస్టెడ్ జర్నల్స్‌) ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.


జీత భత్యాలు: నెలకు రిసెర్చ్ అసోసియేట్ రూ.40,000; రిసెర్చ్ అసిస్టెంట్ రూ.35,000 ఇస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.01.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 29.01.2023.


Notification


Online Application


Website



 


Also Read:


లైబ్రేరియన్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! అప్లికేషన్ లింక్ ఇదే! చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 71 లైబ్రేరియన్ పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్ పరిధిలో 40 పోస్టులు, టెక్నికల్ ఎడ్యకేషన్ పరిధిలో 31 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఖాళీల భర్తీ ఎంపిక చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 12,523 - రీజియన్ల వారీగా ఖాళీలు ఇలా!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 18న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించింది, అయితే 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను జనవరి 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో రీజియన్ల (18-25 వయసు) వారీగా 9,329 పోస్టులు ఉండగా.. 18-27 వయసు వారీగా 2665 పోస్టులు, ఇక  హవిల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. అంటే మొత్తం 12,523 ఉద్యోగాల్లో 11,994 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా, 529 హవిల్దార్ పోస్టులున్నాయన్నమాట.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...