ప్రభుత్వ, బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న మీ కోసం ఐడీబీఐ, ఎస్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరకాలను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చాం.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఆఫీసర్ల కోసం భారతీయ పౌరుల నుంని ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ స్థానాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 07, 2022. ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిపదికన తీసుకోనుంది ఎస్బీఐ. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా బ్యాంక్‌లో మొత్తం 641 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
ఉద్యోగం పేరు: రిటైర్డ్ ఆఫీసర్ల 
అధికారిక వెబ్‌సైట్‌: sbi.co.in
ఆఖరు తేదీ: జూన్ 07, 2022


ఇండియన్ బ్యాంక్ ఎస్‌వో ఉద్యోగాలు
స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థులను ఆహ్వానిస్తూ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది ఇండియన్ బ్యాంక్. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.indianbank.in ద్వారా మే 24, 2022 నుంచి జూన్ 16 వ తేదీ వరకు ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 
ఉద్యోగం పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్స్
అధికారిక వెబ్‌సైట్‌: www.indianbank.in
ఆఖరు తేదీ: జూన్ 16, 2022


బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు
పలు ఉద్యోగాల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్ (CLO), డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (Dy. CTO) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 10, 2022లోపు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. 


ఉద్యోగం పేరు: చీప్‌ లెర్నింగ్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ 
అధికారిక వెబ్‌సైట్: bankofbaroda.in 
ఆఖరు తేదీ: జూన్ 10, 2022


IDBI బ్యాంక్ ఉద్యోగాలు
ఎగ్జిక్యూటివ్‌ల పోస్ట్‌కి (కాంట్రాక్ట్‌పై) ఏడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రేడ్-A' అసిస్టెంట్ మేనేజర్‌గా అబ్సార్ప్షన్ కోసం కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.  IDBI బ్యాంక్ PGDBF 2022-23లో అడ్మిషన్ కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 17, 2022 వరకు www.idbibank.in వద్ద బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 


పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్‌
అధికారిక వెబ్‌సైట్‌: www.idbibank.in
ఆఖరు తేదీ: జూన్ 17, 2022