హైదరాబాద్ నగరానికి చెందిన దక్కన్ బ్లాస్టర్స్ స్వచ్ఛంద సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. ఐటీతో పాటు ఇతర కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి జనవరి 5న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు తెలిపింది. మాసాబ్‌ట్యాంక్ పరిధిలోని ఖాజా మాన్సన్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
క్యూబెక్ ఓవర్సీస్, ఏఎస్ఎం ఇన్‌ఫ్రా ప్రాపర్టీస్ & డెవలపర్స్ ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహిస్తున్నారు. జాబ్ మేళాలో హాస్పిటాలిటీ, టెలికాం సెక్టార్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఐటీ, ఐఈఎల్‌టీఎస్, సెక్యూరిటీ సంస్థలు, బ్యాంకులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో జాబ్‌మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం 8374315052 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చని నిర్వహకులు తెలిపారు.
ఇతర ముఖ్యమైన వాక్‌ఇన్‌లు..
➥ సదర్‌ల్యాండ్-హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్‌లు
హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన సదర్ ల్యాండ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
🔰 కస్టమర్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 0-3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: ఏటా రూ.1 లక్ష-రూ.3.5 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ వేదిక: Sutherland Global Solutions,
Lanco Hills, Sai Vaibhav Layout,
Manikonda, Hyderabad.
ఇంటర్వ్యూ తేది: ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 వరకు.
➥ సుందరం ఫైనాన్స్-హైదరాబాద్‌లో ఖాళీలు
హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన సుందరం ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
🔰 బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ పోస్టులు
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 3-8 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ వేదిక: Sundaram Finance Ltd,
Fourth Floor, F.No. 401, 7-1-397/101,118,
Sri Sai Goverdhan Kunj, Opp. To Dominos,
Near S.R Nagar community hall,
S.R Nagar, Hyderabad- 500038.
ఇంటర్వ్యూ తేది: జనవరి 6, 7 తేదీల్లో.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు.
Website
➥ హైదరాబాద్‌లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన ఇండియన్ ఈగల్స్ సంస్థ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.
అర్హత: అండర్ గ్రాడ్యుయేషన్/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 0-5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: సంవత్సరానికి రూ.50000 - రూ.3 లక్షల వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ వేదిక: AP Productivity House,
Opposite NATCO Pharma Building,
Banjara Hills, Road No. 2,
Near Jubilee Hills check post.
Hyderabad, Telangana 500034.
ఇంటర్వ్యూ తేది: జనవరి 2 నుంచి 11 వరకు.
Website