లికాలంలో జుట్టును కాపాడుకోవడమంటే పెద్ద టాస్కే. చాలామంది చుండ్రు, జుట్టు రాలే సమస్యతో బాధపడతారు. చలి నుంచి కాపాడుకోవడానికి నిత్యం తలను ఉన్ని దుస్తులతో కప్పుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తుంటాయి. అయితే, ఇకపై మీరు ఈ సమస్యలపై చింతించాల్సిన అవసరం లేదని, జుట్టు సమస్యల్ని లోపలి నుంచి సమర్థవంతంగా పరిష్కరించగల సామర్థ్యం ఉన్న స్కాల్ఫ్ సీరమ్ లు అందుబాటులో ఉన్నాయని నిపుణులు అంటున్నారు. స్కాల్ఫ్ సీరమ్‌లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయని తెలిపారు. 


సీరమ్ వాడటం వల్ల ప్రయోజనాలు


సీరమ్ లు రసాయనాలతో తయారు చేస్తారు. ఇందులోని సమ్మేళనాలు పొడిబారిన, జిడ్డు, చుండ్రు లేదా లింప్ హెయిర్ వంటి స్కాల్ఫ్ సమస్యల్ని పరిష్కరించడానికి తయారు చేస్తారు. సైన్స్ ఆధారిత ఫార్ములేషన్ లు సాధారణంగా సుధీర్ఘమైన R&D ప్రక్రియ ద్వారా వీటిని రూపొందిస్తారు. ఈ సీరమ్ లు జుట్టు మొదలు నుంచి రాసుకోవడం వల్ల పోషకాలు అందుతాయి. నేరుగా మూలాల దగ్గర సీరమ్ అప్లై చేయడం వల్ల ఇది జుట్టుకి బలమైన, ఒత్తైన ఆకృతి ఇస్తుంది. జుట్టు కనిపించే తీరును ప్రభావితం చేస్తుంది.


అనేక విభిన్న కారకాలు పొడిబారిన జుట్టుని సరి చేయడంలో విఫలమవుతాయి. కానీ ఇవి జుట్టు కుదుళ్ళ నుంచి బలాన్ని ఇవ్వడం వల్ల వెంట్రుకలు మెరిసిపోతూ ఉంటాయి. కొత్త హెయిర్ స్టైల్స్ ఫాలో అవాలనుకునేవాళ్ళు తరచుగా క్రీమ్, జెల్స్ ఉపయోగిస్తారు. జుట్టు నిగనిగలాడేలా చేయడానికి చాలా ఉత్పత్తులు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల జుట్టు మరింత పొడిగా పాడైపోతుంది. స్కాల్ఫ్ సీరమ్ సహాయంతో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అదనపు సౌందర్య సాధనాల అవసరం లేకుండా సహజమైన షైన్ ని అందిస్తుంది.


ఆరోగ్యకరమైన జుట్టు


మెరిసే జుట్టుని పొందటం కోసం సీరమ్ ఎక్కువ మంది ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. జుట్టుకి పోషణ అందించడం కోసం వేడి నీటితో తలస్నానం చేసిన తర్వాత లేదంటే హెయిర్ కలర్ వేసుకోవాలని అనుకున్నప్పుడు హెయిర్ వాష్ తర్వాత స్కాల్ఫ్ సీరం అప్లై చేయడం మంచిది.


చుండ్రుని తగ్గిస్తుంది


చలికాలంలో వాతావరణం పొడిగా తక్కువ ఉష్ణోగ్రత కారణంగా చుండ్రు సమస్య వేధిస్తూ ఉంటుంది. చాలా మంది ఎదుర్కొనే స్కాల్ఫ్ సమస్యల్లో ఇది ఒకటి. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు చర్మం పొడిబారిపోతుంది. ఇది చనిపోయిన చర్మ కణాల పొరని తొలగిస్తుంది. చుండ్రు మాదిరిగానే స్కాల్ఫ్ పై అధికంగా నూనె ఉత్పత్తి కావడం వల్ల కూడా చుండ్రు ఏర్పడుతుంది. దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. స్కాల్ఫ్ సీరమ్ చుండ్రుని సమర్థవంతంగా తొలగిస్తుంది. ఇవి తరచూ ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలకి దీర్ఘకాలిక పరిష్కారాన్ని పొందవచ్చు.


స్కాల్ఫ్ సీరమ్ ఉపయోగించే విధానం కొత్తదే అయినప్పటికీ సాంప్రదాయక జుట్టు సంరక్షణ ఉత్పత్తులు అందించే ప్రయోజనాలు అందించలేకపోవచ్చు. ఇవి జుట్టు మూలాల్లో ఉన్న సమస్యలని కూడా పరిష్కరించగలవు. అధిక నాణ్యత కలిగిన స్కాల్ఫ్ సీరమ్ లు ఉపయోగించడం చాలా కీలకం. ఇవి తరచూ అప్లై చేయడం వల్ల జుట్టు రూపాన్ని సమూలంగా మార్చుకోవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మందు తాగిన తర్వాత హ్యాంగోవర్ తగ్గాలంటే నానబెట్టిన వీటిని తినేయండి