ఎన్నో పోషక గుణాలు కలిగిన ఖర్జూరం ఇప్పుడు అందరూ తినడానికి ఇష్టం చూపిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ అనగానే వాల్ నట్స్, జీడిపప్పు, బాదం, కిస్ మిస్, అంజీరా ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఆ జాబితాలోని ఖర్జూరం మాత్రం చాలా మంది పక్కన పెట్టేస్తారు. కానీ ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. అలసట, నీరసంగా అనిపించినప్పుడు ఖర్జూరం తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. జిగటగా ఉండే ఖర్జూరం మాత్రమే కాదు ఎండు ఖర్జూరం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మెదడు పనీతిరు సరిగా ఉంచేందుకు ఇవి సహాయపడతాయి. వ్యాధుల నుంచి రక్షిస్తాయి. నానబెట్టిన ఖర్జూరాలు ఉదయం పూట రెండు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రోగాలని దూరం పెట్టొచ్చు.


ఖర్జూరాలని మధ్యాహ్నం లేదా సాయంత్రం పూట స్నాక్స్ గాను తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. బరువు తక్కువగా ఉన్న వాళ్ళు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బరువును పొందుతారు. రాత్రి వేళ నెయ్యితో కలిపి ఖర్జూరాలు తినడం వల్ల బరువు పేరుగుతారు.


ఖర్జూరం నానబెట్టి తినడం వల్ల ప్రయోజనాలు


నానబెట్టడం వల్ల ఖర్జూరాల్లో ఉండే టానిన్లు, ఫైటిక్ యాసిడ్స్ ని తొలగిస్తుంది. వాటి నుంచి పోషకాలను సులభంగా గ్రహించేలా చేస్తుంది. నానబెట్టడం వల్ల అవి జీర్ణం కావడం సులభం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్పుకొచ్చారు. ఖర్జూరం నుంచి పూర్తి పోషకాలు పొందాలంటే మాత్రం ఖచ్చితంగా రాత్రిపూట వాటిని నానబెట్టుకోవాలి. తినడానికి ముందు కనీసం 8-10 గంటలు నానబెట్టుకుంటే మంచిది.


మరిన్ని ప్రయోజనాలు


☀ మలబద్ధకాన్ని నివారిస్తుంది


☀ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది


☀ ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ని నియంత్రించడంలో సహాయపడుతుంది


☀ ఎముకల ఆరోగ్యాన్ని బలపరుస్తుంది


☀ బ్లడ్ ప్రెజర్ ని నియంత్రిస్తుంది


☀ లైంగిక శక్తిని పెంచుతుంది


☀ మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది


☀ అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది


☀ రక్తహీనతకి చెక్ పెడుతుంది


☀ ఆరోగ్యకరమైన బరువు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది


☀ హెమరాయిడ్స్(పైల్స్ సమస్య) నివారిస్తుంది


☀ వాపుని తగ్గిస్తుంది


☀ గర్భిణులకి అవసరమైన పోషకాలు ఇందులో ఉన్నాయ్


☀ చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది


పిల్లలకి రోజుకి రెండు చొప్పున ఖర్జూరం పెట్టడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తక్కువ శరీర బరువు, తక్కువ హిమోగ్లోబిన్, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఖర్జూరం తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఇది పోషకాల పవర్ హౌస్, ఖనిజాలు, విటమిన్స్ ఎండు ఖర్జూరంలో పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరంలో పొటాషియం ఉంటుంది. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఖర్జూరాల్లో ఉండే ఆర్గానిక్ సల్ఫర్ సీజనల్ అలర్జీలను నివారించడంలో సహాయపడుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే నానబెట్టిన ఖర్జూరాలు ఉత్తమ హ్యాంగోవర్ ఆహారంగాను పని చేస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: చలికాలంలో తరచూ జలుబు ఎందుకు చేస్తుందో తెలుసా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి