నోయిడా ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా డిప్యూటీ డైరెక్టర్, EDP అసిస్టెంట్, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఇంటర్, సంబధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మాన్యువల్ టైప్‌రైటర్‌పై లేదా కంప్యూటర్‌లో స్పీడ్‌గా టైప్ చేయకలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 12 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.


వివరాలు...


పోస్టుల సంఖ్య: 14


1) డిప్యూటీ డైరెక్టర్(ఫైనాన్స్ & అకౌంట్స్): 02


అర్హత: బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ లేదా డిప్లొమా. సంబధిత పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 40 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.


జీతం: రూ. 67,700-రూ.2,08,700.



2) EDP అసిస్టెంట్: 01


అర్హత: డిగ్రీ(కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సంబధిత పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.


జీతం: రూ.35,400- రూ.1,12,400.



3) జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్(JHS): 03


అర్హత: సివిల్ ఇంజినీరింగ్(డిగ్రీ లేదా డిప్లొమా). సంబధిత పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.


జీతం: రూ.35,400-రూ.1,12,400.



4) స్టెనోగ్రాఫర్ - డి: 04


అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 
స్కిల్ టెస్ట్ నార్మ్స్ డిక్టేషన్: 10 mts@ 80 w.p.m. ట్రాన్స్‌క్రిప్షన్: మాన్యువల్ టైప్‌రైటర్‌పై లేదా కంప్యూటర్‌లో 65 మీ. (ఇంగ్లీష్) 75 మీ. (హిందీ) 50 మీ. (ఇంగ్లీష్) 65 మీ.(హిందీ) టైపింగ్ స్కిల్స్ ఉండాలి.


వయోపరిమితి: 27 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.


జీతం: రూ.25,500-రూ.81,100.



5) లోయర్ డివిజన్ క్లర్క్(LDC): 04


అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మాన్యువల్ టైప్ రైటర్ మీద టైపింగ్ స్పీడ్ 30 w.p.m. ఇంగ్లీష్ లేదా 25 w.p.m. హిందీలో ఉండాలి.


వయోపరిమితి: 27 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.


జీతం: రూ.19,900-రూ.63,200.



దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 


దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు రూ.200.


చెల్లింపు మోడ్: నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లించాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 



ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.11.2022.


🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 17.12.2022.



Notification


Online Application 


Website 


Also Read:


ఏపీలో 1,010 ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్! పోస్టులు ఇవే!
ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1010 వెల్ఫేర్ ఆఫీసర్స్, కేర్ టేకర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్ల పై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ నవంబరు 18న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు మంచి సదుపాయాలు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. వారు బాగా చదువుకోవడానికి, ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలని సీఎం సూచించారు.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఉద్యోగాలు - పూర్తి వివరాలు ఇవీ!
హైదరాబాద్ పరిధిలో ఖాళీగా ఉన్న రెండు పోస్టులకు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(హ్యూమానిటి/సోషల్ సైన్సెస్/సోషియాలజి/సైకాలజీ/సోషల్ వర్క్), కంప్యూటర్ అప్లికేషన్స్, డేటాఎంట్రీ ఆపరేషన్స్ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణిత దరఖాస్తు ఫారాలను నింపి సంబంధిత ధ్రువపత్రాలు జతపరిచి నోటిఫికేషన్ వెలువడిన 10 రోజులలోగా సంబంధిత చిరునామాలో అందచేయాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...