IND vs NZ T20:  భారత నయా సంచలనం సూర్యకుమార్ యాదవ్ పై న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ ప్రశంసలు కురిపించాడు. అతను షాట్లు ఆడే తీరు నమ్మశక్యం కాకుండా ఉంటుందని అన్నాడు. సూర్య చాలా అద్భుతమైన ఆటగాడని ప్రశంసించాడు. 


న్యూజిలాండ్ తో టీమిండియా 3 టీ2లు, 3 వన్డేల సిరీస్ ఆడనుంది. నవంబర్ 18న వెల్లింగ్టన్ లో జరగాల్సిన మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయింది.  బే ఓవల్ వేదికగా రేపు రెండో టీ20 ఆడనుంది. ఈ సందర్భంగా ఆ జట్టు ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ మాట్లాడాడు. సూర్యకుమార్ బ్యాటింగ్ తనను ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలిపాడు.  


సూర్యకుమార్ అద్భుతమైన ఆటగాడు. అతను కొట్టే షాట్లు నమ్మశక్యం కాకుండా ఉంటాయి. నేను కలలో కూడా అతనిలా బ్యాటింగ్ చేయలేను. అసలు ఛాన్సే లేని బంతిని కూడా అతడు స్టాండ్స్ లో పడేస్తాడు. ఇదంతా అతని మణికట్టు బలం వలనే సాధ్యమవుతుంది. ఇది అరుదుగా ఉండే ప్రతిభ. అని గ్లెన్ ఫిలిప్స్ అన్నాడు.  ఆస్ట్రేలియాతో పోలిస్తే తమ దేశంలో సూర్య స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉండవచ్చని ఫిలిప్స్ అభిప్రాయపడ్డాడు. బే ఓవల్ లో ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచులో ఇరు జట్ల బ్యాటర్లు ఎలాంటి స్ట్రైక్ రేట్ నమోదు చేస్తారో చూడాలని ఉందని అన్నాడు. ఆసీస్ తో పోలిస్తే కివీస్ బౌండరీలు కొంచెం చిన్నగా ఉంటాయి. పిచ్ లు సారూప్యంగా ఉంటాయి. కొంచెం బౌన్స్ ఉంటుంది. ఇక్కడ మేం ఎలాంటి స్ట్రైక్ రేట్ నమోదు చేస్తామనేది ఆసక్తి కరంగా ఉంది.  అని కివీ బ్యాటర్ చెప్పాడు.


నెంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్య


ఈ ఏడాది సూర్యకుమార్ అద్భుత ఫాం లో ఉన్నాడు. అత్యుత్తమంగా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే టీ20 ల్లో నెంబర్ వన్ బ్యాటర్ గా అవతరించాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ లోనూ అద్భుతంగా ఆడాడు. న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ కూడా వరల్డ్ కప్ లో ఉత్తమంగా రాణించాడు.