IBPS RRB Application: దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి 'ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ-సీఆర్‌పీ XIII' నోటిఫికేషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌ (IBPS) జూన్ 6న విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 9,995 గ్రూప్‌-ఎ ఆఫీస‌ర్ (స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌-బి ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 1149 పోస్టులు ఉన్నాయి. వీటిలో 570 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు, 525 ఆఫీసర్ స్కేల్-1 పోస్టులు, 46 ఆఫీసర్ స్కేల్-2 పోస్టులు, 8 ఆఫీసర్ స్కేల్-3 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఏపీలో 452, తెలంగాణ 697 ఖాళీలను భర్తీ చేయనున్నారు.  


పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 7న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జూన్‌ 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబరు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.


వివరాలు..


* ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ - సీఆర్‌పీ-XIII, 2024


ఖాళీల సంఖ్య: 9,995


1) ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌): 5585 పోస్టులు


2) ఆఫీస‌ర్ (స్కేల్‌-1): 3499 పోస్టులు


3) ఆఫీస‌ర్ (స్కేల్‌-2): 782 పోస్టులు


విభాగాలు: అగ్రికల్చర్ ఆఫీసర్-70, మార్కెటింగ్ ఆఫీసర్-11, ట్రైజరీ మేనేజర్-21, లా ఆఫీసర్-30, సీఏ-60, ఐటీ-94, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్-496.


3) ఆఫీస‌ర్ (స్కేల్‌-3): 129 పోస్టులు


తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన పోస్టులు...


➥ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 570 పోస్టులు


ఏపీ: 150 పోస్టులు (ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు: 100, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు: 50)


తెలంగాణ: 420 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్: 285, తెలంగాణ గ్రామీణ బ్యాంక్: 135)


➥ ఆఫీసర్ స్కేల్-1: 525 పోస్టులు


ఏపీ: 300 పోస్టులు (ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు: 250, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు: 50)


తెలంగాణ: 225 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్: 150, తెలంగాణ గ్రామీణ బ్యాంక్: 75)


➥ ఆఫీసర్ స్కేల్-2: 46 పోస్టులు


⫸ ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్): 40 పోస్టులు (తెలంగాణ గ్రామీణ బ్యాంక్: 40)


⫸ ఆఫీసర్ స్కేల్-2 (ఐటీ): 03 పోస్టులు (తెలంగాణ గ్రామీణ బ్యాంక్: 03)


⫸ ఆఫీసర్ స్కేల్-2 (సీఏ): 02 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్: 01, తెలంగాణ గ్రామీణ బ్యాంక్: 01)


⫸ ఆఫీసర్ స్కేల్-2 (ట్రెజరీ): 01 పోస్టు (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్: 01)


⫸ ఆఫీసర్ స్కేల్-3: 08 పోస్టులు (తెలంగాణ గ్రామీణ బ్యాంక్: 08)


అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి.


అనుభవం: ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.


వయోపరిమితి (01.06.2024 నాటికి):


➥ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.06.1996 - 01.06.2006 మధ్య జన్మించి ఉండాలి. 


➥ ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1994 - 31.05.2006 మధ్య జన్మించి ఉండాలి. 


➥ ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) పోస్టులకు 21- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1992 - 31.05.2003 మధ్య జన్మించి ఉండాలి. 


➥ ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1984 - 31.05.2003 మధ్య జన్మించి ఉండాలి. 


➥ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3-8 సంవత్సరాలు, ఇతరులకు 5 సంవత్సరాల వరకు, వితంతు-ఒంటరి మహిళలకు జనరల్/ఈడబ్ల్యూఎస్-35, ఓబీసీ-38, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తి్స్తుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది. 


ఎంపిక విధానం: ప్రిలిమినరీ; మెయిన్ పరీక్షల ఆధారంగా.


పరీక్ష విధానం:



ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.06.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.06.2024.


➥ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సవరణ: 07.06.2024 - 27.06.2024.


➥ ప్రీ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌(పీఈటీ) తేదీలు: 22.07.2024 - 27.07.2024.


➥ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2024.


➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: ఆగస్టు/సెప్టెంబర్‌, 2024.


➥ ఆన్‌లైన్ ఎగ్జామ్ - మెయిన్స్‌/సింగిల్: సెప్టెంబర్‌/అక్టోబరు, 2024.


➥ ఇంటర్వ్యూ నిర్వహణ: నవంబర్‌, 2024.


Notification


Officers (Scale-I, II & III) Online Application


Office Assistants (Multipurpose) Online Application


Website




మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..