IB ACIO Executive Recruitment 2025 : ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ACIO (II) ఎగ్జిక్యూటివ్ నియామకానికి నోటిఫికేషన్‌ను కేంద్రం విడుదల చేసింది. మొత్తం 3,717 పోస్టుల భర్తీ కోసం అర్హుల నుంచి దరఖాస్తులను కేంద్ర  హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 19జులై 2025న ప్రారంభమవుతుంది. 10ఆగస్టు 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ కేటగిరీలు వారీగా ఉన్న గ్రేడ్ II/ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత ప్రమాణాలు కలిగి ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు హోంమంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ mha.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 


కేటగిరీ వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి. 
జనరల్‌ అభ్యర్థులకు   1,537
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS) 442
ఓబీసీలు(OBC)  946
ఎస్సీలు (SC)  566
ఎస్టీలు(ST)  226


అర్హతలేంటీ? 
ఇంటెలిజెన్స్ బ్యూరో విడుదల చేసిన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (IB ACIO) పోస్టులకు అర్హతలు పరిశీలిస్తే ... అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. ప్రాథమిక కంప్యూటర్ ప్రావీణ్యం తప్పనిసరి కాదు కానీ ప్రధాన్యత ఇస్తారు. అభ్యర్థి ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తుంది. వయస్సు విషయానికి వస్తే దరఖాస్తుదారులు 10ఆగస్టు 2025 నాటికి 18 దాటి 27 ఏళ్ల లోపువారై ఉండాలి. 



దరఖాస్తు ఫీజు
జనరల్, OBC, EWS వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు రూ. 650 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST, PWD వర్గాల అభ్యర్థులు రూ.550 చెల్లించాలి. ఈ ఫీజులు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అభ్యర్థులు హోం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ mha.gov.inద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు లింక్ 19 జులై 2025 నుంచి యాక్టివ్ అవుతుంది. దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరు తేదీ 10ఆగస్టు 2025.


దరఖాస్తు ఎలా చేయాలి



  • స్టెప్‌1: mha.gov.in ని సందర్శించండి

  • స్టెప్‌2: IB ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2025 లింక్‌పై క్లిక్ చేయాలి. 

  • స్టెప్‌3: కచ్చితమైన వివరాలతో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ పూర్తి చేయాలి. 

  • స్టెప్4: మీ ఫొటోగ్రాఫ్, సంతకం, సర్టిఫికెట్‌లతో సహా అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి. 

  • స్టెప్ 5: ఆన్‌లైన్ చెల్లింపు గేట్‌వేని ఉపయోగించి దరఖాస్తు ఫీజు చెల్లించి, పూర్తి చేసిన ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి. 


పరీక్షా విధానం


ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, డిస్క్రిప్టివ్‌, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రాత పరీక్షలో మొత్తం 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి, వీటిని 1 గంటలోపు పూర్తి చేయాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు పోతుంది. ఆ తర్వాత 50 మార్కులతో కూడిన డిస్క్రిప్టివ్‌ పరీక్ష, ఆపై 100 మార్కుల ఇంటర్వ్యూ ఉంటుంది.


ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనేది భారత హోం మంత్రిత్వ శాఖ (MHA)లో పని చేసే గ్రూప్ 'C' (నాన్-గెజిటెడ్) పదవి. జాతీయ భద్రత కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తారు. IB ACIO అధికారులు నిఘా సేకరించడం, విశ్లేషించడం, నిఘా కార్యకలాపాలను నిర్వహించడం, క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయడం వీళ్ల విధి.