Kiran Abbavaram's K RAMP Glimpse Released: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తోన్న లేటెస్ట్ మూవీ 'కె ర్యాంప్'. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. తాజాగా, మూవీ నుంచి 'రిచెస్ట్ చిల్లర్ గయ్' గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. కేరళలో ఓ తెలుగు కుర్రాడి అల్లరిని ఫన్నీ, ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. గత చిత్రాలతో పోలిస్తే మాస్ లుక్, ఎనర్జిటిక్ డైలాగ్స్‌తో అదరగొట్టారు కిరణ్ అబ్బవరం.
ఎనర్జిటిక్ గ్లింప్స్... ఫుల్ జోష్
'చేటలు ఎల్లారుకూ నమస్కారం.. ఈసారి ఒక్కొక్కరికీ బుర్ర పాడు... జారుడే' అనే కిరణ్ డైలాగ్‌తో గ్లింప్స్ ప్రారంభం కాగా... కిరణ్ తనదైన మాస్ లుక్‌తో అదరగొట్టారు. మాస్ ఆటిట్యూడ్ ఉన్న కుమార్ అనే యువకుడిగా ఆయన కనిపించనుండగా... చిల్ కావడంలో అతనికి పోటీ లేదనేలా ఎనర్జిటిక్‌గా కనిపించారు.
గ్లింప్స్ క్లైమాక్స్‌లో 'మనం ఏఎంబీ సినిమాలో మలయాళ ప్రేమకథలు చూసి హిట్ చేస్తాం. కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే ఆ సినిమాల్లో ఉండే ఆంథెటిసిటీ మన సినిమాల్లో ఉండదు. ప్రేమ మాత్రం బాగుండాలని కోరుకుంటాం..' అంటూ కిరణ్ చెప్పిన డైలాగ్ హైప్ క్రియేట్ చేస్తోంది. అయితే, గ్లింప్స్‌లో కిరణ్ చెప్పే డైలాగ్స్ అక్కడక్కడ కొన్ని వర్డ్స్ ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి.
ఈ మూవీని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మక్ సంయుక్తంగా నిర్మిస్తుండగా... ఈ సినిమాతోనే జైన్స్ నాని దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. కిరణ్ సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు నరేష్,సాయికుమార్,వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
దీపావళికి రిలీజ్
ఈ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్ కానుంది. సినిమా గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోసారి కిరణ్ (Kiran Abbavaram) హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు. 'క' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం లాస్ట్ మూవీ 'దిల్ రూబ' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. డిఫరెంట్ యూత్, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు.
వరుస మూవీస్
కిరణ్ హీరోగా లవ్ ఎంటర్‌టైనర్ 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ తెరకెక్కుతుండగా... రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సరసన శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. 'కే ర్యాంప్' మూవీతో పాటు 'క' సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు.