Soubin Shahir Impressed Dance In Monica Song From Coolie: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'కూలీ'. ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన 'మోనికా' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్‌లో బుట్ట బొమ్మ పూజా హెగ్డేతో పాటు మలయాళ స్టార్ సౌబిన్ తన గ్రేస్ స్టెప్పులతో అదరగొట్టారు.
రెడ్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ పూజా హెగ్డే స్టెప్పులతో అదరగొట్టగా... 'మోనికా మై డియర్ మోనికా' అంటూ ఫుల్ జోష్‌తో సౌబిన్ వేసిన స్టెప్పులు నెట్టింట ఓ ఊపు ఊపేస్తున్నాయి. 'ఆయనలో ఇంత మంచి డ్యాన్సర్ ఉన్నారా?' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆయన గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్ To హీరో
అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన సౌబిన్... గెస్ట్ రోల్స్ చేస్తూనే హీరో, డైరెక్టర్, నిర్మాతగా మారారు. తెలుగు ప్రేక్షకులకు 'సౌబిన్'... 'రోమాంచమ్', 'మంజుమ్మల్ బాయ్స్' మూవీస్‌తో పరిచయమయ్యారు. తండ్రి బాబూ షాహిర్ అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ కంట్రోలర్ కాగా... సినిమాలపై మక్కువతో 'వియత్నాం కాలనీ' మలయాళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారారు. సిద్ధిఖీ, ఫాజిల్, సంతోష్ శివన్ వంటి డైరెక్టర్స్ వద్ద పలు సినిమాలకు పని చేశారు.
ఆ తర్వాత పలు సినిమాల్లో దాదాపు పదేళ్లు కీలక పాత్రలు, అవసరం మేరకు గెస్ట్ రోల్స్ చేశారు సౌబిన్. 2015లో వచ్చిన 'ప్రేమమ్' మూవీలో 'పీటీ శివన్ సర్'గా ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేశారు. ఆ తర్వాత వచ్చిన 'కుంబలంగి నైట్స్'తో మరింత పాపులర్ అయ్యారు. మోహన్ లాల్, మమ్ముట్టి, పహాద్ ఫాజిల్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ ప్లే చేశారు. ఈ ఏడాది 'ప్రావింకూడు షాపు' మూవీతో మంచి హిట్ అందుకున్నారు.
Also Read: ఇండస్ట్రీలో మరో విషాదం - సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూత... ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలతో మూవీస్
డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గానూ...
ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే డైరెక్టర్‌గా మారి మంచి హిట్ అందించారు సౌబిన్. 2017లో వచ్చిన 'పరవ' మూవీకి ఆయన దర్శకత్వం వహించగా మంచి హిట్ అందుకుంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగిన స్టోరీ ఇది. నిర్మాతగానూ తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. 'మంజుమ్మల్ బాయ్స్'లో నటిస్తూనే నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీలోనే రూ.240 కోట్లకు పైగా అత్యధిక కలెక్షన్లతో రెండో మూవీగా రికార్డు సృష్టించింది.
డ్యాన్స్... వేరే లెవల్...
మోనికా సాంగ్‌లో 'సౌబిన్' డ్యాన్స్ వేరే లెవల్‌లో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తొలిసారిగా ఈ మూవీలో డ్యాన్స్ చేయగా... ఆయనలో ఇంతటి డ్యాన్స్ టాలెంట్ ఉందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ టాలెంట్ గుర్తించిన లోకేశ్ కనగరాజ్‌దే ఈ క్రెడిట్ అని అంటున్నారు.
ఇక 'కూలీ' విషయానికొస్తే తలైవాతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్, శ్రుతిహాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మించారు. ఆగస్ట్ 14న తమిళంతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.