Deva Katta About Mayasabha Teaser Reactions: దేశ రాజకీయ చరిత్రలోనే చంద్రబాబు, వైఎస్సాఆర్ అంటేనే ఓ సంచలనం. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ రాజకీయ బద్ద శత్రువులుగా ఎలా మారారు?. వీరిద్దరి పొలిటికల్ జీవితాల ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ 'మయసభ'. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. 

Continues below advertisement


నెట్టింట కొందరి ట్రోలింగ్స్


'సోనీ లివ్' ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందించిన ఈ సిరీస్ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంటుండగా... కొందరు మాత్రం సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. తమ నాయకున్ని తక్కువ చేసి చూపించారంటూ కొందరు కామెంట్స్ చేశారు. దీనిపై డైరెక్టర్ దేవా కట్టా రియాక్ట్ అయ్యారు. పాలిటిక్స్ అనేవి అందరికీ అవకాశాలు కల్పించే ఓ ప్రక్రియ మాత్రమేనని అన్నారు. 'పాలిటిక్స్ ఓ గౌరవప్రదమైన పోటీ. అందరికీ అవకాశాలు కల్పించే ఓ ప్రక్రియ. ఏకీభవించని వాళ్లను అంతం చేసే ప్రతిజ్ఞ కాదు.' అంటూ ట్వీట్ చేశారు.






అది మాత్రం గ్యారెంటీ


టీజర్‌కు వస్తోన్న అద్భుతమైన రెస్పాన్స్‌కు ఆయన హర్షం వ్యక్తం చేశారు. 'గంట గంటకీ టీజర్‌పై పెరుగుతున్న ఇంట్రెస్ట్, అన్నీ ప్లాట్ ఫామ్స్‌లో ట్రెండ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏ పార్టీకి చెందిన వారైనా, ఏ నాయకుని భక్తులైనా... పార్టీలకు, లీడర్స్‌కు అతీతంగా ఓ ఉన్నతమైన మానవీయ అనుభూతిని ఇస్తుంది. ఇది మాత్రం గ్యారెంటీ.' అంటూ రాసుకొచ్చారు.






Also Read: మిడిల్ క్లాస్ To మిలియనీర్ - ఓటీటీలోకి 'సోలో బాయ్'... థియేటర్‌లో ఉండగానే అప్డేట్ ఇచ్చిన హీరో


టీజర్ అదుర్స్


'మయసభ' టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఇద్దరి ప్రాణ స్నేహితులు రాజకీయ బద్ధ శత్రువులుగా ఎలా మారారు? అనే స్టోరీ బ్యాక్‌డ్రాప్‌గా సిరీస్ రూపొందించారు. టీజర్‍లో ఒక్కో డైలాగ్ హైప్ క్రియేట్ చేస్తోంది. సీబీఎన్ పాత్రలో ఆది పినిశెట్టి, వైయస్సార్ పాత్రలో చైతన్య రావు నటించినట్లు అర్థం అవుతోంది. డైరెక్ట్‌గా పేర్లు వాడకున్నా కాకర్ల కృష్ణమ నాయుడిగా ఆది పినిశెట్టి... ఎంఎస్ రామిరెడ్డిగా చైతన్యరావు కనిపించనున్నారు. 'ఇది చావో రేవో అర్ధం కావడం లేదు రెడ్డి... 20 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పు కింద నలిగిపోతుంది అనుకోలేదు' అని సీబీఎన్ చెబుతుంటే... 'ఈ రోజు నువ్వు గెలిస్తే... ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే బాణంగా మారుతుంది. ఆ బాణాన్ని నిన్ను ఓడించేంతవరకు వాడుతూనే ఉంటాను' అని వైయస్సార్ చెబుతారు. ఈ ఇంటెన్స్ డైలాగ్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. 


ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్


ఈ సిరీస్‌ను దేవా కట్టాతో పాటు కిరణ్ జయకుమార్ రూపొందించారు. హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించారు. ఆగస్ట్ 7 నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.