HMFW Recruitment: తూర్పు గోదావరి జిల్లాలో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్(హెచ్‌ఎంఎఫ్‌డబ్ల్యూ), ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 61 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి పదవ తరగతి, ఇంటర్, వొకేషనల్, బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. సరైన అర్హతలున్నవారు జనవరి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 61 పోస్టులు
⏩ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 03 పోస్టులు
Roster points: I - 54 బీసీఏ (జీ); I – 56 పీహెచ్ ఓహెచ్ జీ; I - 58 ఎస్టీ డబ్ల్యూ.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఇంటర్మీడియట్‌తో పాటు డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీ లేదా మెడికల్‌ల్యాబ్ టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ లేదా ఇంటర్మీడియట్(వొకేషనల్), ప్రభుత్వ అనుబంధ సంస్థలలో ఒక సంవత్సరం అప్రెంటీస్ శిక్షణ తీసుకోవాలి. ఏపీ పారా మెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ అప్-టుడేటర్‌నెవల్‌తో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
⏩ ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ(FNO): 20 పోస్టులు
Roster points: I – 6 పీహెచ్ వీహెచ్(జీ), I – 48 ఓసీ(జీ) ఎస్, I – 85 బీసీబీ జీ, I – 86 ఓసీ జీ, I – 87 ఎస్సీ (డబ్ల్యూ), I – 88 ఓసీ (జీ) ఈడబ్ల్యూఎస్, I –89 బీసీడీ (జీ), I –90 ఓసీ (డబ్ల్యూ), I –91 ఎస్సీ(జీ), I –92 ఓసీ (జీ), I –93 బీసీడీ (Gజీ), I –94 బీసీఈ (జీ), I –95 బీసీబీ (జీ), I –96 ఓసీ (డబ్ల్యూ) ఈడబ్ల్యూఎస్, I – 97 ఎస్సీ (జీ), I –98 ఓసీ (జీ) ఎస్, I –99 బీసీబీ (డబ్ల్యూ), I –100 ఓసీ (జీ), II – 1 ఓసీ(డబ్ల్యూ), II – 2 ఎస్సీ (డబ్ల్యూ).
అర్హత: 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
⏩ శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్(SAW): 38 పోస్టులు
Roster points: I 46 ఓసీ-జీ, I 47 ఎస్సీ-డబ్ల్యూ, I 48 ఓసీ జీ (ఎస్), 1 49 బీసీ-బీ-డబ్ల్యూ, I 50 ఓసీ-డబ్ల్యూ-ఈడబ్ల్యూఎస్, I 51 ఓసీ-జీ, I 52 ఎస్సీ-జీ, I 53 ఓసీ-జీ, I 54 బీసీఏ-జీ, I 55 ఓసీ-డబ్ల్యూ, I 56 పీహెచ్-ఓహెచ్-Gజీ, I 57 ఓసీ-జీ, I 58 ఎస్టీ(డబ్ల్యూ), I 59 ఓసీ(డబ్ల్యూ), I 60 బీసీ-బీ-జీ, I 61 ఓసీ-జీ-ఈడబ్ల్యూఎస్, I 62 ఎస్సీ-జీ, I 63 ఓసీ-జీ, I 64 బీసీ-డీ-జీ, I 65 ఓసీ-డబ్ల్యూ, I 66 –ఎస్సీ(డబ్ల్యూ), I 67 –ఓసీ-జీ, I 68 బీసీ-డీ-జీ, I 69 బీసీ-ఈ-జీ, I 70 బీసీ-ఏ-జీ, I 71 ఓసీ(డబ్ల్యూ) I 72 ఎస్సీ-జీ, I 73 ఓసీ-జీ-ఈడబ్ల్యూఎస్, I 74 బీసీ-బీ-జీ, I 75 ఎస్టీ-జీ, I 76 ఓసీ-జీ, 1 77 ఎస్సీ-జీ, I 78 ఓసీ-డబ్ల్యూ, I 79 బీసీ-ఏ-జీ, I 80 ఓసీ-జీ, I 81 బీసీ-బీ-డబ్ల్యూ, I 82 ఓసీ-జీ-ఈడబ్ల్యూఎస్, I 83 ఎస్టీ-జీ..
అర్హత: 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.200. అభ్యర్థులు District Medical and Health Officer పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.01.2025.
✦ తాత్కాలిక మెరిట్ లిస్ట్ అండ్ అభ్యంతరాల స్వీకరణ: 28.01.2025.
✦ తుది మెరిట్ లిస్ట్: 05.02.2025.
✦ నియామక ఉత్తర్వుల జారీ: 15.02.2025.