GGH Srikakulam Recruitment 2024: శ్రీకాకుళం జిలాల్లోని వైద్య సంస్థల్లో కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పారామెడికల్ పోస్టుల భర్తీకి ఏపీ వైద్యావిద్యా విభాగం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 2 కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాగా.. 38 పోస్టులను ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో జనవరి 20లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. జిల్లా పరిధిలోకి చెందినవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.


వివరాలు..


* పారామెడికల్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 40


➥ బుక్ బేరర్: 01 పోస్టు


➥ డీఈవో/ కంప్యూటర్ ఆపరేటర్: 03 పోస్టులు


➥ ఎలక్ట్రీషియన్ (గ్రేడ్-2): 01 పోస్టు


➥ స్పీచ్ థెరపిస్ట్: 02 పోస్టులు


➥ M.N.O’s: 13 పోస్టులు


➥ F.N.O’s: 8 పోస్టులు


➥ పర్సనల్ అసిస్టెంట్: 01 పోస్టు


➥ జూనియర్ అసిస్టెంట్: 02 పోస్టులు 


➥ అసిస్టెంట్ లైబ్రేరియన్: 01 పోస్టు


➥ హౌజ్ కీపర్/వార్డెన్స్: 02 పోస్టులు 


➥ అటెండర్స్/ ఆఫీస్ సబార్డినేట్స్: 02 పోస్టులు 


➥ క్లాస్ రూమ్ అటెండెన్స్: 01 పోస్టు


➥ ఆయా: : 01 పోస్టు


➥ ల్యాబ్ అటెండెంట్: 01 పోస్టు


➥ లైబ్రరీ అటెండెంట్: 01 పోస్టు


అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది. 


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, శ్రీకాకుళంలోని నిర్దిష్ట కౌంటర్లలో అందజేయాలి.


దరఖాస్తు ఫీజు: రూ.250. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.  


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Office of the Principal, 
Government Medical College, Srikakulam.


ముఖ్యమైన తేదీలు...


➥ నోటిఫికేషన్ వెల్లడి: 12.01.2024


➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 20.01.2024. (5:00 P.M.)


➥ దరఖాస్తుల పరిశీలన: 22.01.2024 - 29 .01.2024.


➥ అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితా వెల్లడి: 30.01.2024.


➥ ప్రొవిజినల్ జాబితాపై అభ్యంతరాలు: 31.01.2024 - 01.02.2024.


➥ తుది మెరిట్ జాబితా వెల్లడి: 05.02.2024 


➥ ధ్రవపత్రాల పరిశీలన, నియామక పత్రాల పంపిణీ: 06.02.2024


Notification


Application


Website


ALSO READ:


ఏపీపీఎస్సీ 'గ్రూప్-2' దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ఏపీలో 'గ్రూప్‌-2' పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఏపీపీఎస్సీ (APPSC) పొడిగించింది. దరఖాస్తు గడువు జనవరి 10తో ముగియనుండగా.. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు  మరో వారంరోజుల పాటు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ జనవరి 10న ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి. . .