Nagarjuna Naa Saami Ranga Release Update: సంక్రాంతి బరిలో చివరగా థియేటర్లలోకి వచ్చిన సినిమా 'నా సామి రంగ'. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రమిది. భోగి పండుగ సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా ఇండియాలో షోస్ పడే సమయానికి ఓవర్సీస్ నుంచి రివ్యూలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ముందు రోజు రాత్రి అమెరికాలో ఎర్లీ ప్రీమియర్ షోలు స్టార్ట్ అవుతాయి. ట్విట్టర్ రివ్యూలు వస్తాయి. అయితే... 'నా సామి రంగ'కు అటువంటివి ఏమీ లేవు. 


అమెరికాలో 'నో' ఎర్లీ ప్రీమియర్ షోలు!
అవును... అమెరికాలో 'నా సామి రంగ' షోలు ఇంకా స్టార్ట్ కాలేదు. ఆ మాటకు వస్తే ఎర్లీ ప్రీమియర్ షోస్ అసలు లేవు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా సేమ్ టైంకి సినిమా ప్రదర్శించనున్నారు. ఇంకా చెప్పాలంటే... ఏపీ, తెలంగాణలో ఒకట్రెండు చోట్ల ఎర్లీ మార్నింగ్ షోలు స్టార్ట్ అయ్యాయి. అమెరికాలోని ఎన్నారై ఆడియన్స్ కంటే ముందు తెలుగు రాష్ట్రాల్లో జనాలు సినిమా చూస్తున్నారు. ట్విట్టర్ రివ్యూలు రాకపోవడానికి కారణం అది.


Also Readడ్యాన్సుల్లో శ్రీ లీలకు పోటీ లేదుగా... స్టార్స్ సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ తెలుగమ్మాయే  






నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ప్లానింగ్!
'నా సామి రంగ'ను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ప్రొడ్యూస్ చేశారు. దీనికి ముందు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'స్కంద' చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాకూ అమెరికాలో ఎర్లీ మార్నింగ్ ప్రీమియర్ షోలు లేవు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో ఒకేసారి సినిమా ప్రదర్శించారు. ఇప్పుడు కూడా ఆయన సేమ్ స్ట్రాటజీ & ప్లానింగ్ ఫాలో అవుతున్నారు.


Also Readగుంటూరు కారం రివ్యూ: మహేష్ బాబు ఎనర్జీ & ఆ మాస్ సూపర్, మరి సినిమా?










సంక్రాంతి సందర్భంగా విడుదలైన తేజ సజ్జ 'హనుమాన్' సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోగా... 'గుంటూరు కారం', 'సైంధవ్' సినిమాలకు ఆశించిన రెస్పాన్స్ రాలేదు. మిక్స్డ్ టాక్ ఉంది. దాంతో 'నా సామి రంగ' రిజల్ట్ కోసం కేవలం అక్కినేని అభిమానులు మాత్రమే కాదు... తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Also Readసైంధవ్ రివ్యూ : సైకోగా వెంకటేష్ ఎలా చేశారు? ఆయన 75వ సినిమా హిట్టా? ఫట్టా?



నాగార్జున జోడీగా ఆషికా రంగనాథ్ నటించిన ఈ సినిమాలో 'అల్లరి' నరేష్, మిర్నా మీనన్ ఓ జంట కాగా... రాజ్ తరుణ్, రుక్సార్ థిల్లాన్ మరో జంట! కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. 'పలాస' దర్శకుడు కరుణ కుమార్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు...' పాటతో ఆస్కార్ అందుకున్న గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పాటలు, సంగీతం అందించారు.