గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్లు, యూనిట్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 16న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ట్రేడ్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన వారికి రూ.35,000- రూ.1,38,000 (పే స్కేలు) వరకు జీతం ఇస్తారు.



వివరాలు..


 


మొత్తం సంఖ్య: 282


పోస్టుల వారీగా ఖాళీలు..


1) జూనియర్ ఇంజినీర్ (కెమికల్): 02


 


2) జూనియర్ ఇంజినీర్(మెకానికల్): 1


 


3) ఫోర్‌మాన్(ఎలక్ట్రికల్): 1


 


4) ఫోర్‌మాన్(ఇన్‌స్ట్రుమెంటేషన్): 14


 


5) ఫోర్‌మాన్(మెకానికల్): 1


 


6) ఫోర్‌మాన్(సివిల్): 1


 


7) జూనియర్ సూపరింటెండెంట్(అధికారిక భాష): 5


 


8) జూనియర్ సూపరింటెండెంట్(హెచ్‌ఆర్): 20


 


9) జూనియర్ కెమిస్ట్: 8


 


10) టెక్నికల్ అసిస్టెంట్ (లేబొరేటరీ): 3


 


11) ఆపరేటర్ (కెమికల్): 29


 


12) టెక్నీషియన్ (ఎలక్ట్రికల్): 35


 


13) టెక్నీషియన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 16


 


14) టెక్నీషియన్ (మెకానికల్): 38


 


15) టెక్నీషియన్ (టెలికాం & టెలిమెట్రీ): 14


 


16) ఆపరేటర్ (ఫైర్): 23


 


17) అసిస్టెంట్ (స్టోర్ & కొనుగోలు): 28


 


18) అకౌంట్స్ అసిస్టెంట్: 24


 


19) మార్కెటింగ్ అసిస్టెంట్: 19
 



అర్హతలు:
అభ్యర్థులు పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్‌తో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత మరియి పని అనుభవం కలిగి ఉండాలి.


వయోపరిమితి: 


▶ సీరియల్ నెంబర్ 1,2: 45 సంవత్సరాలు

▶ సీరియల్ నెంబర్ 3: 35 సంవత్సరాలు

▶ సీరియల్ నెంబర్ 4,5: 33 సంవత్సరాలు

▶ సీరియల్ నెంబర్ 6, 10: 31 సంవత్సరాలు

▶ సీరియల్ నెంబర్ 7, 8, 9: 28 సంవత్సరాలు

▶ సీరియల్ నెంబర్ 11 నుండి 19: 26 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: జనరల్,ఈడభ్ల్యూఎస్,ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ 50/-చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,పీడభ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఆన్‌లైన్  ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.



పే స్కేలు: రూ.35,000-1,38,000/-

ముఖ్యమైన తేదీలు..


▶ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.08.2022.


▶ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.09.2022.


Notification



Online Application



Website  


 


 


Also Read:



బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే
భార‌త హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌) క‌మ్యూనికేష‌న్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. పురుషుల‌తోపాటు మ‌హిళా అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులకు ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ లేదా ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించి మే 14 నుంచి జూన్ 12 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు; అర్హతలివే!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, టైపింగ్ తెలిసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  మూడుదశల్లో ఉద్యోగ ఎంపికలు చేపడతారు. మొదటి దశలో రాతపరీక్ష; రెండో దశలో ఫిజికల్ మెజర్‌మెంట్, స్టెనోగ్రఫీ (ఏఎస్‌ఐ)/టైపింగ్(హెడ్ కానిస్టేబుల్), మెడికల్ టెస్ట్ ఆధారంగా ప్రతిభ కనబరచిన అభ్యర్థులతో మెరిట్ జాబితాను సిద్ధంచేసి ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..